ఇంత టైం చాలు, భూకంపం పుట్టిస్తా: అక్బరుద్దీన్ ఓవైసీ

Published : Nov 24, 2018, 10:52 AM IST
ఇంత టైం చాలు, భూకంపం పుట్టిస్తా:  అక్బరుద్దీన్ ఓవైసీ

సారాంశం

తాను  రాష్ట్రంలో ఐదు రోజుల పాటు  పర్యటిస్తే  భూకంపం వస్తోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ  చెప్పారు


హైదరాబాద్: తాను  రాష్ట్రంలో ఐదు రోజుల పాటు  పర్యటిస్తే  భూకంపం వస్తోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ  చెప్పారు.

తెలంగాణలో తమ పార్టీ  హవా ఉంటుందని  కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడంపై అక్బరుద్దీన్ స్పందించారు. ఏ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ  హవా ఉందో  తేలుస్తానని సవాల్ విసిరారు.

రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తాను పర్యటిస్తే భూకంపం వస్తోందన్నారు.  మజ్లిస్ పవర్  ఏమిటో నిరూపిస్తానని   ఆయన తేల్చి చెప్పారు.గాంధీ టోపీలు ధరించి కాంగ్రెస్ నేతలు గులాంగిరీ చేస్తున్నారని ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  నిర్మల్ లో ఎంఐఎం సభ నిర్వహించకుండా ఉండేందుకు   రూ. 25 లక్షలను కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిందని  ఇటీవనే అక్బరుద్దీన్ సోదరుడు అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు  రాజకీయగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఓ కాంగ్రెస్ నేత ఎంఐఎం నేతతో  ఫోన్‌లో సంభాషించినట్టుగా ఉన్న ఆడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

సంబంధిత వార్లలు

నేను అమ్ముడుపోయే రకం కాదు: అసద్

మజ్లిస్‌కు కాంగ్రెస్ రూ.25 లక్షల ఆఫర్ (ఆడియో)

అసద్‌కు మహేశ్వర్ రెడ్డి కౌంటర్: నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకొంటా

రూ.25 లక్షల ఆఫర్: కాంగ్రెస్‌పై అసదుద్దీన్ సంచలన ఆరోపణలు

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ