పాతబస్తీ ఎంఐఎం అడ్డా.. ఇక్కడ మీ పప్పులు ఉడకవు: బీజేపీకి అసద్ వార్నింగ్

Siva Kodati |  
Published : Mar 02, 2021, 02:24 PM IST
పాతబస్తీ ఎంఐఎం అడ్డా.. ఇక్కడ మీ పప్పులు ఉడకవు: బీజేపీకి అసద్ వార్నింగ్

సారాంశం

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు .

ఈ సందర్భంగా అసద్ మాట్లాడుతూ.. ఎంఐఎం ఉన్నంత వరకు పాతబస్తీలో బీజేపీకి మనుగడ ఉండదన్నారు. బల్దియా ఎన్నికల్లో గెలిస్తే ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తా అన్నారని.. ముందు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అహ్మదాబాద్, ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కనీస సదుపాయాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఒవైసీ విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎంను ఓడించటానికి ఓల్డ్ సిటీలో యూపీ సీఎం, బీజేపీ టీమ్ అంతా దిగిందని ఆయన ఎద్దేవా చేశారు.

కానీ ఎంత మంది వచ్చినా.. ఎవరు వచ్చినా ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు తిరుగులేదని అసదుద్దీన్ స్పష్టం చేశారు. బీజేపీ పప్పులు పాతబస్తీలో ఉడకవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓల్డ్ సిటీ అంటే ఎంఐఎం అడ్డా అని... భయపెడితే ఇక్కడ ఎవరూ భయపడేవారు లేరంటూ అసదుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?