హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీర్జా రెహమత్ బేగ్ ను ఎంఐఎం తమ అభ్యర్ధిగా బరిలో దింపింది.
హైదరాబాద్: హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధిని ఎంఐఎం మంగళవారం నాడు ప్రకటించింది. మీర్జా రెహమత్ బేగ్ ను తమ అభ్యర్ధిగా బరిలోకి దింపుతున్నట్టుగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మంగళవారంనాడు ప్రకటించారు. హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది.
హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో ఎంఐఎం అభ్యర్ధి సయ్యద్ హసన్ జాఫ్రీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జాఫ్రీ ఈ ఏడాది మే 1వ తేదీన రిటైర్ కానున్నారు. దీంతో ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది.
హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ స్థానంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎంఐఎంకు మద్దతు తెలపనున్నారు.
Happy to announce that Mirza Rahmath Baig will be ’s MLC candidate. I’d also like to thank outgoing MLC Syed Amin Ul Hasan Jafri sb for his valuable services to AIMIM. Inshallah, we’ll continue to benefit from his experience & wisdom in future too
— Asaduddin Owaisi (@asadowaisi)హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ పార్టీ స్వంతంగా పోటీ చేసి విజయం సాధించే పరిస్థితులు లేవు. ఇతర పార్టీలు మద్దతిస్తేనే విజయం సాధ్యం కానుంది. ఎంఐఎం అభ్యర్ధికి బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
also read:హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు: ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు
హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని బీజేపీ తొలుత భావించింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పోటీ చేయాలని కమలం పార్టీ యోచిస్తుంది. ఈ ఎన్నికను రాజకీయంగా తమకు అవకాశంగా మలుచుకోవాలని ఆ పార్టీ భావిస్తుంది. పోటీపై కమలం పార్టీ ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
హైద్రాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఓట్లు 127.అయితే ఇందులో 9 స్థానాలు ఖాళీ గా ఉన్నాయి. దీంతో 118 మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఎంఐఎంకు 52 , బీఆర్ఎస్ కు 41, బీజేపీకికి 25 ఓట్లున్నాయి. ఈ స్థానంలో విజయం సాధించాలంటే 60 ఓట్లు దక్కించుకోవాలి.