Hyderabad: మిలాద్-ఉన్-నబీ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆదివారం ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. బేగంపేట్ ఫ్లైఓవర్, లంగర్ హౌజ్ ఫ్లైఓవర్, డబీర్‌పురా ఫ్లైఓవర్, లాలాపేట్ ఫ్లైఓవర్, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మినహా అన్ని ఫ్లై ఓవర్‌లు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల మధ్య మూసివేయనున్నారు.
Milad-un-Nabi processions: ఈద్ మిలాద్-ఉన్-నబీ ఊరేగింపులకు ముందు, నగర పోలీసులు ఆదివారం ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి జారీ చేసిన ప్రకటనలో ప్రధాన ఊరేగింపు సయ్యద్ క్వాద్రీ చమన్, గులాం ముర్తుజా కాలనీ, ఫలక్ నూమా నుండి ప్రారంభమై ఫలక్ నూమా ఎక్స్ రోడ్స్, అలియాబాద్ ఎక్స్ రోడ్స్, లాల్ దర్వాజా ఎక్స్ రోడ్స్, చార్మినార్, గుల్జార్ హౌస్, మదీనా, నయాపుల్ బ్రిడ్జ్, సాలార్ జంగ్ మ్యూజియం, సాలార్ జంగ్ రోటరీ, పురానీ హవేలీ, ఎతేబార్ చౌక్, బీబీ బజార్లోని వోల్టా హోటల్ వద్ద ముగుస్తుంది. బేగంపేట్ ఫ్లైఓవర్, లంగర్ హౌజ్ ఫ్లైఓవర్, డబీర్‌పురా ఫ్లైఓవర్, లాలాపేట్ ఫ్లైఓవర్, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మినహా అన్ని ఫ్లై ఓవర్‌లు ఉదయం 8 నుండి సాయంత్రం 6 గంటల మధ్య మూసివేయనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
ఈ క్రింది ప్రాంతాల్లో దారి మళ్లీంపు తీసుకోవాలని సూచించారు.
షంషీర్‌గంజ్, ఇంజిన్ బౌలి, ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్, కందికల్ గేట్, ఫిసల్‌బండ, ఓల్డ్ కర్నూలు రోడ్, నాగులచింత, చార్మినార్.
సయ్యద్ క్వాద్రీ చమన్, గులాం ముర్తుజా కాలనీ, బహదూర్‌పురా, కాలాపత్తర్ 'వై' జంక్షన్, అలీ నగర్ జహనుమా, లాల్ దర్వాజ టెంపుల్, ఛత్రినాక, సుధా టాకీస్.
మొఘల్‌పురా బీబీ బజార్, అక్కన్న మాదన్న, మీర్-కా-దైరా, మొఘల్‌పురా నుండి గౌలిపుర రహదారి, బీబీ బజార్, తలబ్‌కట్ట నుండి వోల్టా హోటల్, మొఘల్‌పురా వాటర్ ట్యాంక్ రోడ్డు.
కౌసర్ మసీదు, వారాసిగూడ, పద్మారావు నగర్, చిల్కలగూడ X రోడ్స్, గాంధీ విగ్రహం, సీతాఫల్ మండి, వారాసిగూడ ఎక్స్ రోడ్, జామీ మజీద్, దుబాయ్ గేట్, హస్మత్‌పేట్ టీ జంక్షన్, పాత బోవెన్‌పల్లి X రోడ్, ప్రియదర్శిని X రోడ్, MMR గార్డెన్, ఆర్ ఆర్ నగర్, ప్రాగా సొసైటీ టూల్స్ లాండ్, HAL బస్టాప్, సమతా నగర్, వెస్లీ టీచర్స్ కాలనీ, సెయింట్ జేవియర్ స్కూల్, భవానీ నగర్, కోయ బస్తీ చాముండేశ్వరి టెంపుల్, లయన్స్ టౌన్ కాలనీ, మొహమ్మదియా మసీదు.