
నిజామాబాద్ : Secunderabad to Mumbai వెళ్ళే Devagiri Express రైల్లో గురువారం అర్ధరాత్రి దోపిడీ జరిగింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్-దౌల్తాబాద్ స్టేషన్ల మధ్య లో అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దొంగలు Signal system వైర్లు తెంపేసి రైలు అరగంటపాటు ఆగేలా చేశారు. బోగీలపై రాళ్ల దాడి చేశారు. పదిమంది వరకు రైలులోకి వచ్చి ప్రయాణికుల సెల్ఫోన్లు, నగదు, విలువైన వస్తువులను లాక్కుని పరారయ్యారు. చీకట్లో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు హాహాకారాలు చేశారు. dadar వెళ్లేందుకు నిజామాబాద్ లో ఎస్-4 బోగిలో ఎక్కిన మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు.
రాళ్లదాడి నుంచి తప్పించుకునేందుకు కిటికీ వేస్తుండగా, బయట ఉన్న వ్యక్తి గొలుసు తెంచినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. ఆరు నుంచి ఏడు బోగీలపై రాళ్లు విసిరారని, దొంగలు అంబులెన్స్లో వచ్చారని ప్రాథమికంగా నిర్ధారించారు. నాసిక్ జిల్లా మన్మాడ్ స్టేషన్ లో మొదట కేసు నమోదు చేసి ఆ తర్వాత ఔరంగాబాద్ కు బదిలీ చేశారు. దొంగల కోసం గాలిస్తున్నట్లు జీఅర్ పి ఎస్పి మోక్షద పాటిల్ వివరించారు.
ఇదిలా ఉండగా, ఏప్రిల్ 9న ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. Tirupati to Secunderabad కి వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు లో శుక్రవారం అర్ధరాత్రి robbery జరిగింది. గుర్తుతెలియని దుండగులు పథకం ప్రకారం రైలును ఆపి దోపిడీకి పాల్పడ్డారు. అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని తురకపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో దుండగులు సిగ్నల్ తీగలను కత్తిరించారు. దీంతో సిగ్నల్ లేకపోవడంతో స్టేషన్ ఔటర్ లో ఆగిపోయింది. వెంటనే దుండగులు బోగి లోకి చొరబడి మారణాయుధాలను చూపించి ప్రయాణికులను దోచుకున్నారు.
వారి నుంచి నగదు, బంగారు నగలు లాక్కున్నారు. ఎంత మొత్తం దోపిడీ జరిగిందో వివరాలు తెలియరాలేదు. ఆరు తులాల బంగారం, నగలు దుండగులు దోచుకున్నట్టు ప్రాథమిక సమాచారం. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులతోపాటు సివిల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగుల కోసం గాలించారు. అనంతరం తురకపల్లి స్టేషన్ మాస్టర్ రైలుకు సిగ్నల్ ఇచ్చి పంపారు.
ఇదిలా ఉండగా, ఈ ఫిబ్రవరి 14 న Sampark Kranti Express train యశ్వంతపూర్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వెళ్తుండగా Madhya Pradesh రాష్ట్రంలోని భోపాల్ లో దారుణం జరిగింది. ఓ యువతిని సాయం పేరిట మభ్యపెట్టిన కిరాతకుడు రైలులోనే molestationకి పాల్పడ్డాడు యువతి రైలు ఎక్కిన తర్వాత ఆమెకు కూర్చునేందుకు చోటు దొరకలేదు. దీంతో వంట చేసే Bogieలో ఖాళీ ఉందని అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు అంటూ ఓ వ్యక్తి ఆమెను నమ్మించి అక్కడికి తీసుకెళ్లాడు.
అక్కడ ఆమె నిద్రించే సమయంలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. వంట చేసే భోగి వద్దకు వెళ్లగా అందులో ఉన్న వారు వెంటనే తలుపు తెరవలేదు. పోలీసుల ఒత్తిడితో అరగంట తర్వాత తెరిచారు. అక్కడ అపస్మారకస్థితిలో పడివున్న బాధితురాలిని పోలీసులు రక్షించి.. ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 15 మంది అదుపులోకి తీసుకున్న పోలీసులు అసలు నిందితుడిని గుర్తించేందుకు విచారణ కొనసాగిస్తున్నారు.