మీ ఖర్చేంత, కేంద్రానిదెంత.. ఎనిమిదేళ్ల లెక్కలు తీద్దామా: కేటీఆర్‌కు కౌంటరిచ్చిన కిషన్ రెడ్డి

Siva Kodati |  
Published : Apr 22, 2022, 08:45 PM IST
మీ ఖర్చేంత, కేంద్రానిదెంత.. ఎనిమిదేళ్ల లెక్కలు తీద్దామా: కేటీఆర్‌కు కౌంటరిచ్చిన కిషన్ రెడ్డి

సారాంశం

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నిధుల విడుదలకు సంబంధించి మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎనిమిదేళ్లుగా మీరెంత ఖర్చు చేశారో... కేంద్రం ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమని మంత్రి పేర్కొన్నారు. 

మంత్రి కేటీఆర్ సవాల్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) స్పందించారు. సీఎం కేసీఆర్‌తో (kcr) బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఎనిమిదేళ్లుగా మీరెంత ఖర్చు చేశారో... కేంద్రం ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. సాయి గణేష్ ఆత్మహత్య (sai ganesh suicide) చేసుకున్న చోటే.. టీఆర్ఎస్‌ను భూస్థాపితం చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. సచివాలయం లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని... తాము ఎవ్వరినీ వదిలి పెట్టమని ఆయన హెచ్చరించారు. పోలీసులు లక్ష్మణ రేఖ దాటొద్దని.. సాయి గణేష్ ఆత్మహత్యు ప్రభుత్వానిదే బాధ్యతని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల హయాంలోనే ఖమ్మం (khammam) అభివృద్ధి జరిగిందని.. ఖమ్మంలో మీరేం చేశారో చెప్పాలంటూ కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ గెలవబోతోందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. 

కాగా.. కొద్దిరోజుల క్రితం (bjp) బీజేపీకి (trs) టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) సవాల్ విసిరారు. తాను చెప్పింది రుజువు చేస్తే సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు. కేంద్రానికి రూ.3,65,797 కోట్లు ఇచ్చామని.. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూ.కోటి 65 లక్షలు మాత్రమేనన్నారు. దమ్ముంటే బీజేపీ నాయకులు రుజువు చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay), టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డిలపై (revanth reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ చిల్లరగాళ్లను ఎవరూ పట్టించుకోలేదని ఫైరయ్యారు. కేసీఆరే లేకుంటే టీపీసీసీ , టీ బీజేపీ ఎక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు. సోషల్ మీడియా, మీడియా వుందని ఇష్టమొచ్చినట్లు మొరుగుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మాట్లాడుతున్న చిల్లర, మల్లర నేతలెవరూ ఆనాడు లేరని కేటీఆర్ గుర్తుచేశారు. ఎవరీ రేవంత్ రెడ్డి... ఎవరీ బండి సంజ్ అంటూ ఫైరయ్యారు. కాలర్ ఎగరేసి నాది తెలంగాణ అని చెప్పే ధైర్యం ఇచ్చింది కేసీఆర్ అని మంత్రి తెలిపారు. కరీంనగర్‌లో ఎంపీగా గెలిపిస్తే ఏం పీకారంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌కు ఏం చేయలేని వాడికి.. పాలమూరులో ఏం పని అని మంత్రి ప్రశ్నించారు. వినోద్ కుమార్ ఎంపీగా వున్నప్పుడు కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ కోసం ప్రయత్నం చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణకు ఇన్నేళ్లలో మీరు ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!