తెలంగాణలో కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం.. రుచి చూసిన మంత్రులు

First Published Aug 3, 2018, 6:05 PM IST
Highlights

పాఠశాల స్ధాయిలో ఉన్న మధ్యాహ్న భోజనం పథకాన్ని కాలేజీ విద్యార్థులకు సైతం అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఇవాళ సచివాలయంలో ఈ పథకంపై సమావేశమైంది.

పాఠశాల స్ధాయిలో ఉన్న మధ్యాహ్న భోజనం పథకాన్ని కాలేజీ విద్యార్థులకు సైతం అందించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఇవాళ సచివాలయంలో ఈ పథకంపై సమావేశమైంది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ డిగ్రీ, ఇంటర్మీడియట్, ఓకేషనల్, పాలిటెక్నిక్, బీ.ఈడీ, డీ.ఈడీ, మోడల్ జూనియర్ కాలేజీలకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలని నిర్ణయించింది.

ఇందుకు కావాల్సిన  మౌలిక వసతులు సమకూర్చుకోవాల్సిందిగా అక్షయపాత్ర ఫౌండేషన్‌ ప్రతినిధులకు సూచించింది. పోషక విలువల కలిగిన భోజనాన్ని అందించేందుకు మెను, వాటి ధరల నివేదికను ఈ నెల 6 లోగా అందించాలని కోరింది.. ఈ నివేదికను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించి నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపింది.

 

అనంతరం విద్యార్థులకు అందించచే భోజనాన్ని మంత్రుల కమిటీ రుచి చూసింది. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జోగురామన్న ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

click me!