300 కోట్ల పెట్టుబడులు... 1000 ఉద్యోగాలు : తెలంగాణకు మరో భారీ కంపనీ (వీడియో)

By Arun Kumar PFirst Published Sep 17, 2018, 6:00 PM IST
Highlights

తెలంగాణ రాష్ర్టంలో భారీ పెట్టుబడులకు ఓ భారీ కంపనీ ముందుకు వచ్చింది. కేవలం పెట్టుబడులే కాదు భారీ స్థాయిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడానికి సదరు సంస్థ ముందుకు వచ్చింది. భారతదేశంలో తన కార్యకలాపాల విస్తరణకు నగరాన్ని ఏంచుకుంది మైక్రాన్ టెక్నాలజీ సంస్ధ. ఇవాళ ఈ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. 
 

తెలంగాణ రాష్ర్టంలో భారీ పెట్టుబడులకు ఓ భారీ కంపనీ ముందుకు వచ్చింది. కేవలం పెట్టుబడులే కాదు భారీ స్థాయిలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించడానికి సదరు సంస్థ ముందుకు వచ్చింది. భారతదేశంలో తన కార్యకలాపాల విస్తరణకు నగరాన్ని ఏంచుకుంది మైక్రాన్ టెక్నాలజీ సంస్ధ. ఇవాళ ఈ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. 

తెలంగాణలో సుమారు 300 కోట్ల పెట్టుబడులతో భారీ కంపనీ నెలకొల్పనున్నట్లు మైక్రాన్ సంస్థ ప్రకటించింది. కేవలం పెట్టుబడులే కాదు భారీగా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది. లక్షా ఏనబై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కంపనీని ఏర్పాటు చేయనున్నారు. టాస్క్, టిహబ్, టీవర్క్స్ తో కలిసి మైక్రాన్ సంస్థ పనిచేయనుంది.

సోమవారం ఈ సంస్థ ప్రతినిధులతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు.  మైక్రాన్ సంస్థ పెడుతున్న ఈ పెట్టుబడి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ మరియు సెమీ కండక్టర్ రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఊతం ఇస్తుందని  మంత్రి తెలిపారు. ప్రపంచంలోని ప్రముఖ సెమీకండక్టర్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన మైక్రాన్ టెక్నాలజీ సంస్ధ హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున కార్యకలాపాలకు సిద్దమైందన్నారు. ఇప్పటికే సింగపూర్ తైవాన్, జపాన్, చైనా, మలేషియా దేశాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు.
 
కేటీఆర్ తో సమావేశమైన వారిలో మైక్రాన్ సంస్థ సీనియర్ డైరెక్టర్ స్టీఫెన్ డ్రేక్, డైరెక్టర్ అమరేందర్ సిదూలు ఉన్నారు.  కంపనీకి అవసరమైన సిబ్బంది ఎంపిక మరియు శిక్షణకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్ తో కలిసి పని చేయనున్నట్లు తెలిపారు. దీంతోపాటు ఇన్నోవేషన్ అవసరాల కోసం మైక్రాన్ సంస్థ టి వర్క్స్ మరియు టీ హబ్ తో కలిసి పని చేస్తుందని తెలిపారు.  తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా మరియు వేగంగా పని చేస్తున్న తీరు తమ కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకోవడానికి ప్రధాన కారణాలుగా కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది. తమ సంస్థ అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వ అధికార యంత్రాంగం స్పందించిన తీరు బాగుందని ఇందుకోసం మంత్రికి ధన్యవాదాలు తెలిపినట్లు తెలిపారు.

వీడియో

"

click me!