టీఆర్ఎస్ పార్టీలో కలకలం...రాజీనామా చేసిన సీనియర్ లీడర్

By Arun Kumar PFirst Published Aug 27, 2018, 12:50 PM IST
Highlights

జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ లీడర్ల మధ్య అంతర్గత కలహాలు బైటపడ్డాయి. జిల్లాలోని మెట్ పల్లి బల్దియా వైస్ ఛైర్మన్ మార్గం గంగాధర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మెట్ పల్లి రాజకీయాల్లో కలకలం రేగింది.
 
జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ లీడర్ల మధ్య అంతర్గత కలహాలు బైటపడ్డాయి. జిల్లాలోని మెట్ పల్లి బల్దియా వైస్ ఛైర్మన్ మార్గం గంగాధర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో మెట్ పల్లి రాజకీయాల్లో కలకలం రేగింది.

మెట్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్ మర్రి ఉమారాణి పై అవిశ్వాసం పెట్టి గద్దె దించడానికి గంగాధర్ గతంలో ముమ్మర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం.  పట్టణానికి చెందిన 20 మంది కౌన్సిలర్లు మన్సిపల్ ఛైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ పై అవిశ్వాసం పెడుతున్నట్లు కలెక్టర్ నోటీసులు అందించారు. అంతే కాదు గతంలో మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ఛైర్ పర్సన్ ఉమారాణి అవినీతికి పాల్పడిందంటూ కౌన్సిలర్లు ఆందోళనకు దిగిన విషయం కూడా తెలిసిందే.  

అయితే తాజాగా ఈ వ్యవహారంలో ముఖ్య పాత్ర వహించిన గంగాధర్ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. గంగాధర్ తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమీషనర్ ఆయాజ్ కు అందించారు. స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకే తాను రాజీనామా చేసినట్లు గంగాధర్ తెలిపారు.

click me!