గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ నిందితులపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 27, 2018, 12:03 PM IST
Highlights

పదకొండేళ్ల తర్వాత గోకుల్ చాట్, లుంబిని పార్క్ పేలుళ్ల కేసులో ఇవాళ కోర్టు తుదితీర్ను వెలవరించనుంది. ఈ సందర్భంగా బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిందితులకు ఎలాంటి శిక్షలు విధించాలో మెజిస్ట్రేట్ కు సూచించారు రాజాసింగ్.

గోకుల్ చాట్, లుంబిని పార్కులో పేలుళ్ల కేసులో ఇవాళ తీర్పు వెలువడనుంది. ఇప్పటివరకు ఈ కేసులో 11 మందిపై చార్జిషీట్ దాఖలు చేసిన పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ ప్రత్యేక స్థానం ఇవాళ నిందితులకు శిక్ష ఖరారు చేయనుంది. అయితే ఈ శిక్ష ఎలా ఉండాలో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.

విదేశాల్లో ఇలా అమాయకుల ప్రాణాలను బలితీసుకునే నిందితులకు నడి రోడ్డులో నిల్చోబెట్టి కాల్చేయడం, ఉరివేయడం చేస్తారన్న రాజాసింగ్ ఈ పేలుళ్ల నిందితులకు కూడా అలాంటి శిక్ష విధించాలని మెజిస్ట్రేట్ ను కోరారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా నిందితులకు కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని ఆయన తీర్పు వెలువరించే మెజిస్ట్రేట్ ను కోరారు.

2007 ఆగష్టు 25వ తేదీన హైద్రాబాద్‌లోని గోకుల్ చాట్, లుంబినీ పార్క్ వద్ద జరిగిన పేలుళ్లలో 42 మంది అమాయకులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో వందల మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ పేలుళ్లకు ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ పాల్పడింది. పదకొండేళ్ల తర్వాత ఈ కేసులో తుది తీర్పు వెలువడనున్న నేపథ్యంలో బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు.  

వీడియో

మరిన్ని వార్తల కోసం కింది లింక్ క్లిక్ చేయండి

గోకుల్‌చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసు: తుది తీర్పు నేడే

click me!