ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం: నిందితుడికి 20 ఏళ్ల జైలు.. నాంపల్లి కోర్ట్ సంచలన తీర్పు

Siva Kodati |  
Published : Apr 15, 2021, 08:52 PM IST
ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం: నిందితుడికి 20 ఏళ్ల జైలు.. నాంపల్లి కోర్ట్ సంచలన తీర్పు

సారాంశం

ఐదేళ్ల పాపపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన సుక్రాత్ సింగ్ .. జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. లారీ లోడింగ్‌ కార్మికుడిగా పనిచేస్తూ మంగళ్‌హట్‌లోని షిబ్లిహిల్స్‌లో అద్దె గదిలో నివసిస్తున్నాడు

ఐదేళ్ల పాపపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన సుక్రాత్ సింగ్ .. జీవనోపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు.

లారీ లోడింగ్‌ కార్మికుడిగా పనిచేస్తూ మంగళ్‌హట్‌లోని షిబ్లిహిల్స్‌లో అద్దె గదిలో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతని పక్కింట్లోనే ఐదేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో వుంటోంది. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ 7వ తేదీ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో చిన్నారి తన సోదరుడితో ఇంటి ఆవరణలో ఆడుకుంటోంది.

ఆమెను చూసిన నిందితుడు చాక్లెట్ ఇస్తానని చెప్పి చిన్నారులిద్దరిని తన గదిలోకి పిలిచాడు. పాప అన్నయ్యకి తన సెల్‌ఫోన్ ఇచ్చి ఆడుకోమని చెప్పారు. అనంతరం సుక్రాత్ పాపపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

తర్వాత వారిద్దరిని గది నుంచి బయటకు పంపేశాడు. అయితే బాలిక ఏడుస్తూ వారి ఇంట్లోకి వెళ్లి జరిగిన దారుణాన్ని తల్లికి తెలియజేసింది. అయితే నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఆమె తల్లి చిన్నారిని తీసుకుని మంగళ్‌హాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భరోసా కేంద్రంలో బాధితురాలికి వైద్యం చేయించి, దర్యాప్తు ప్రారంభించారు. అదే నెల 9న సుక్రాత్‌ను అరెస్ట్ చేసి జ్యూడీషియల్ కస్టడికీ తరలించారు.

అనంతరం కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లిలోని అదనపు మెట్రోపాలిటిన్ సెషన్స్ కోర్ట్ .. సుక్రాత్‌ను దోషిగా తేలుస్తూ అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దానితో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ