ఇది కూడా మాస్కే.. నెట్టింట వైరల్ అవుతున్న మేకలకాపరి !

By AN TeluguFirst Published Apr 22, 2021, 3:50 PM IST
Highlights

మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం చిన్న మునగాల్ చేడ్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మేకల కుర్మయ్య బుధవారం ముఖానికి గిజిగాడి గూడును మాస్కులా ధరించి పింఛన్ కోసం వచ్చాడు.

మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం చిన్న మునగాల్ చేడ్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మేకల కుర్మయ్య బుధవారం ముఖానికి గిజిగాడి గూడును మాస్కులా ధరించి పింఛన్ కోసం వచ్చాడు.

ఇది చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. పశువులను మేపడానికి వెళ్లగా.. పింఛను ఇస్తున్నారని తెలిసి తిరుగి వచ్చానని, మాస్క్ లేకపోతే పింఛను ఇవ్వరని.. మధ్యలో కనిపించిన పిట్టగూడును తీసుకుని మాస్కుగా పెట్టుకున్నాడట. 

చదువుకోకపోయినా మాస్క్ విషయంలో బాధ్యతగా వ్యవహరించాడని అందరూ అభినందించారు. అయితే కుర్మయ్య ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ జర్నలిస్ట్ కుర్మయ్య ఫొటోను షేర్ చేస్తూ..

మేకల కుర్మయ్య మాస్క్ కొనుక్కోలేక.. పక్షి గూడును ధరించి మండల కేంద్రానికి వచ్చాడు. మాస్క్ బదులు పక్షిగూడు ధరించడం అంత సేఫ్ కాదు. కానీ అతను ప్రయత్నించాడు. మాస్కులు కొనుక్కోలేని వారికి ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలంటూ.. ట్వీట్ చేసింది.. 

దీనిమీద నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు. ‘అన్నీ ప్రభుత్వమే ఇవ్వాలంటే ఎలా.. రూ.5 పెట్టి మాస్కు కొనుక్కోలేరా’ అని ఒకరంటే.. రూ. 5కు మాస్క్ దొరుకుతుందా.. అలాంటి మాస్క్ పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుంది అని దీనికి రీ ట్వీట్ చేశారు. 

ఇక మరొకరు ‘అతని భుజం మీదున్న కండువాను మాస్కులా వాడుకోవచ్చు.. అలా చేయకుండా పిట్టగూడు పెట్టుకున్నాడంటే.. ఇది కేవలం సోషల్ మీడియా స్టంటే’ అని స్పందించారు. 

‘మేకల కాపరికి సోషల్ మీడియా గురించి అంత తెలుసంటే అద్భుతమే’ అంటూ దీనికి సెటైర్ రీ ట్వీట్ చేశారు.. ఇంకొకరేమో విగ్రహాలు పెట్టడానికే మా దగ్గర నిధులు లేవంటే మాస్కులు పంపిణీ చేయమంటారా.. అంటూ వెటకరించారు. 

మొత్తానికి మేకల కుర్మయ్య.. తన గిజిగాడి మాస్కుతో తనకు తెలియకుండానే నెట్టింట వైరల్ గా మారిపోయాడు. 
 

click me!