మీరు జనాల్లో బాగా తిరుగుతారు, ఆరోగ్యం జాగ్రత్త: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చిరు ఫోన్

Siva Kodati |  
Published : Jun 05, 2021, 05:11 PM ISTUpdated : Jun 05, 2021, 05:12 PM IST
మీరు జనాల్లో బాగా తిరుగుతారు, ఆరోగ్యం జాగ్రత్త: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి చిరు ఫోన్

సారాంశం

కరోనా నేపథ్యంలో గత కొన్నిరోజులుగా జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాకుండా సినీ పరిశ్రమలో ఎవరైనా కోవిడ్‌తో చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ నేత, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు చిరంజీవి ఫోన్ చేశారు

కరోనా నేపథ్యంలో గత కొన్నిరోజులుగా జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాకుండా సినీ పరిశ్రమలో ఎవరైనా కోవిడ్‌తో చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ నేత, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు చిరంజీవి ఫోన్ చేశారు. శంకర్ ఎలా ఉన్నారు? కుటుంబసభ్యులు బాగున్నారా? అని చిరంజీవి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

Also Read:విశాఖలో చిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్ ప్రారంభం..

మీరు ప్రజల్లో బాగా తిరుగుతారని... కరోనా నేపథ్యంలో పరిస్థితులు బాగోలేవని, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని శంకర్‌ నాయక్‌కు సూచించారు. దీనిపై ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... తన మాటపై జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకును ఇచ్చానని చిరంజీవి అన్నారని చెప్పారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ తరపున మహబూబాబాద్ జిల్లాకు ఆక్సిజన్ బ్యాంకును కేటాయించడం పట్ల చిరంజీవికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?