మేడారం మహా జాతరను ఇక రైలు, ఆర్టీసీ బస్సు, ప్రైవేటు వెహికిల్స్‌లో కాకుండా.. హెలికాప్టర్ ట్యాక్సీలో వెళ్లి వీఐపీ దర్శనం చేసుకుని రావొచ్చు. ఇందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ బెంగళూరుకు చెందిన తుంబీ ఏవియేషన్‌తో డీల్ కుదుర్చుకుంది.
Helicopter taxi: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. ఈ వనతీర్థానికి మన రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారు. రెండేళ్లకు ఒకసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దమొత్తంలో భక్తులు వస్తారు. ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ జాతర జరుగుతుంది. లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ప్రభుత్వం కూడా భక్తులకు ఇబ్బంది కలుగకుండా అన్ని రకాల వసతుల ఏర్పాటుకు చేస్తున్నది.
ముఖ్యంగా భక్తులను మేడారం జాతరకు తీసుకెళ్లడానికి రైలు, బస్సుల సేవలను పెంచుతున్నది. మేడారం జాతర కోసం ప్రత్యేకంగా కొన్ని రైళ్లను పెంచుతున్నట్టు కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. కాగా, మేడారం జాతర కోసం అదనంగా సుమారు 6,000 ఆర్టీసీ బస్సులను దింపుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. జాతర రోజుల్లో వాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. చాలా సార్లు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపేసి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే వాహన శ్రేణి చాలా దూరం వరకు నిలిచి ఉంటుంది.
undefined
కేవలం రోడ్డు మార్గంలోనే కాదు.. ఇక పై ఆకాశ మార్గంలోనూ మేడారం వెళ్లడానికి ఏర్పాట్లు జరిగాయి. హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన తుంబి ఏవియేషన్ ఆపరేటర్లు ఈ ట్యాక్సీ హెలికాప్టర్‌లను రంగంలోకి దించింది.
Also Read: PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లో మోడీ డబ్బులు ఎప్పుడు పడతాయంటే?
మేడారం జాతరకు ట్రిప్ వేయడానికి ఒక్కరికి రూ. 28,999 చార్జి తీసుకుంటున్నారు. ఈ చార్జీలోనే హెలికాప్టర్ ట్యాక్సీలో వెళ్లిన భక్తులకు వీఐపీ దర్శనం లభిస్తుంది. ఒక వేళ ఆ గిరి జాతరను విహంగ వీక్షణం గావించాలనుకుంటే ఒకరికి రూ. 4,800 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు హెలికాప్టర్‌లో ఆ మహా మేడారం జాతరను ఆకాశంలో నుంచి చూసే అవకాశం ఉంటుంది.
ఈ హెలికాప్టర్ ట్యాక్సీ టికెట్ బుకింగ్ కోసం, ఇతర వివరాలు తెలుసుకోవడానికి 74834 33752, 04003 99999 నెంబర్లకు కాల్ చేయవచ్చు. లేదా.. ఆన్‌లైన్‌లో infor@helitaxi.comలో వివరాలు పొందవచ్చు. రాష్ట్ర పర్యాటక శాఖ ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఈ హెలికాప్టర్ ట్యాక్సీ సేవలు అందిస్తున్నది. ఈ బుకింగ్ వ్యవహారం ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి పర్యవేక్షణలో ఉంటుందని తెలిసింది.