medaram jatara 2022 : ట్రైబల్ సర్క్యూట్ గా మేడారం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Published : Feb 18, 2022, 01:26 PM IST
medaram jatara 2022 : ట్రైబల్ సర్క్యూట్ గా మేడారం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

సారాంశం

ములుగు జిల్లా మేడారం జాతరను ట్రైబల్ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేపు సాయంత్రం అమ్మవార్లు వనప్రవేశం చేయనున్నారు. సామక్క, సారలమ్మలను దర్శించుకున్న తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు... 


మేడారం : ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు medaram jatara  ప్రతీక అని కేంద్రమంత్రి Kishan Reddy అన్నారు. మేడారం పరిసర ప్రాంతాలను Tribal circuit గా అభివృద్ధి చేస్తామని చెప్పారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలను ఆయన దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రూ.45 కోట్లతో మూలుగులో గిరిజన వర్సిటీ పనులు చేపట్టినట్టు తెలిపారు. త్వరలోనే పనులు పూర్తి చేస్తామన్నారు. 

మరోవైపు జాతరకు భక్తులు పోటెత్తారు రేపే చివరి రోజు కావడంతో అమ్మవార్ల దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. గద్దెల వద్ద తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. రేపు సాయంత్రం అమ్మవార్లు వన ప్రవేశం చేయనున్నాయి. 

కాగా, medaram జాతర సందర్భంగా చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల దాకా భక్తజనంతో కిటకిటలాడింది. Cilakalaguṭṭa నుంచి మేడారానికి సమ్మక్ ను తీసుకు వచ్చే క్రతువు గురువారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉద్విగ్నభరితంగా సాగింది. సమ్మక్కను మేడారం గద్దెలపైకి చేర్చే ఏర్పాట్లు గురువారం ఉదయమే మొదలయ్యాయి. సమ్మక్క వడ్డెలు, పూజారులు ఉదయం ఐదున్నర గంటలకే మేడారం సమీపంలోని చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి కంకవనాలు (వెదురు కర్రలు) తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి వడరాలు (కొత్త కుండలు) తెచ్చి గద్దెలపైకి చేర్చారు. 

తర్వాత  సాయంత్రం ఐదు గంటల సమయంలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై కి తెచ్చేందుకు పూజారులు, వడ్డెల బృందం చిలకల గుట్టపైకి బయలుదేరారు. అప్పటికే చిలకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. భక్తులు సమ్మక్క వచ్చే దారి పొడవునా రంగురంగుల పట్నాలు, ముగ్గులతో నింపేశారు. సాయంత్రం 7 గంటల సమయంలో సమ్మక్క తల్లితో పూజారులు చిలుకల గుట్ట దిగడం ప్రారంభించారు. ఇది చూసి భక్తులు, శివసత్తుల పూనకాలతో ఊగిపోయారు. పూజారులు సిద్దబోయిన లక్ష్మణరావు, మహేష్, చందా బాబురావు, దూప వడ్డె నాగేశ్వరరావు అమ్మవారిని వడ్డె కొక్కెర కృష్ణయ్యకు అప్పగించాక మేడారం వైపు కదిలారు.

ప్రభుత్వం తరఫున అధికారిక లాంఛనాల ప్రకారం సమ్మక్కను ఆహ్వానిస్తూ ఆమె రాకకు సూచికగా ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గాల్లోకి కాల్పులు జరిపారు. వెంటనే చిలకలగుట్ట నుంచి మేడారం దాకా లక్షలాది మంది భక్తజనం సమ్మక్క నామస్మరణంతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ప్రభుత్వం తరఫున మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్రెడ్డి సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు.

ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల మధ్య సమ్మక్క ప్రతిరూపం మేడారం వైపు బయలుదేరారు. దారిపొడవునా భక్తులు అమ్మకు దండం పెట్టుకున్నారు. మొక్కల కోసం తెచ్చుకున్న ఒడిబియ్యం చల్లారు. సమ్మక్కను తీసుకు వస్తున్న బృందం అక్కడినుంచి ఎదుర్కోళ్ల పూజా మందిరం చేరుకుంది. అక్కడ వడ్డెలు, పూజారులు ఎదురుకోళ్లు జరిపించారు. సమ్మక్కకు సెలపెయ్యను బలి ఇచ్చారు. మేడారం ముఖద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకు వస్తున్న పూజారులకు స్వాగతం పలికారు. తర్వాత 09:19 గంటల సమయంలో గద్దెల పైకి తీసుకు వచ్చారు.

సమ్మక్క తల్లి గద్దెకు పైకి వచ్చినప్పటి నుంచి ప్రతిష్టించే వరకు గద్దల ఆవరణలో విద్యుత్ దీపాలను ఆపివేశారు. రహస్య పూజలు చేసిన అనంతరం రాత్రి 9.45 గంటల సమయంలో దీపాలను ఆన్ చేశారు. మొదట మేడారం వాసులు, జిల్లా అధికారులు మొక్కులు చెల్లించుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే