
ఢిల్లీలోని తెలంగాణ భవన్ పైనుంచి ఓ సైబర్ నేరగాడు కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు అయ్యాయి. వివరాలు.. సైబర్ క్రైమ్‌కు సంబంధించి ఉత్తర భారతానికి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకన్న తెలంగాణ పోలీసులు.. తెలంగాణ భవన్‌కు తీసుకొచ్చారు. భనవంలోని 4వ ఫ్లోర్‌లో పోలీసులు అతడిని విచారిస్తున్నారు. అయితే అతడు వాష్ రూమ్‌కు వెళ్తున్నానని చెప్పడంతో.. పోలీసులు సంకేళ్లను తొలగించారు. అయితే అదే అదనుగా తప్పించుకోవాలని చూశాడు. బిల్డింగ్ నాలుగో ఫ్లోర్ నుంచి అక్కడున్న పైపుల ద్వారా పారిపోయేందుకు ప్రయత్నించాడు.
పైపులు పట్టుకుని పారిపోయే ప్రయత్నం చేయగా.. జారి కిందపడిపోయాడు. అయితే కింద ఉన్న చెట్ల మీద పడి.. తర్వాత కిందకు జారడంతో అతనికి ప్రాణప్రాయం తప్పింది. దీంతో వెంటనే స్పందించిన అధికారులు అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే తెలంగాణ భవన్‌లో ఉన్న అంబులెన్స్ మొరాయించడంతో.. ఆటోలో అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అయితే కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు అయినట్టుగా తలుస్తోంది.