మెదక్‌ కారులో డెడ్‌బాడీ మిస్టరీ చేధించిన పోలీసులు: ముగ్గురి అరెస్ట్

By narsimha lodeFirst Published Aug 11, 2021, 10:41 AM IST
Highlights


మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో కారులో డెడ్ బాడీ మిస్టరీని పోలీసులు చేధించారు. ధర్మకారి శ్రీనివాస్ ను ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలో హత్య చేసినట్టుగా గుర్తించారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

మెదక్: మెదక్ జిల్లా వెల్ధుర్తి మండలం మంగళపర్తి వద్ద హోండాసిటీ కారులో డెడ్‌బాడీ సహా మృతదేహం దగ్ధమైన ఘటన మిస్టరీని పోలీసులు చేధించారు. ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. హత్యకు గురైంది రియల్ఏస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు.కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామానికి చెందిన ధర్మకారి శ్రీనివాస్ రియల్ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. స్వగ్రామం నుండి ఆయన  హైద్రాబాద్ కు వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో అనుమానాస్పదస్థితిలో హత్యకు గురయ్యాడు.

&n

మెదక్ జిల్లా వెల్ధుర్తి మండలం మంగళపర్తి వద్ద హోండాసిటీ కారులో డెడ్‌బాడీ సహా మృతదేహం దగ్ధమైన ఘటన మిస్టరీని పోలీసులు చేధించారు. ఆర్ధిక లావాదేవీలే ఈ హత్యకు కారణంగా పోలీసులు గుర్తించారు. హత్యకు గురైంది రియల్ఏస్టేట్ వ్యాపారి ధర్మకారి శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. pic.twitter.com/DeJOQadD63

— Asianetnews Telugu (@AsianetNewsTL)

bsp;

 

also read:కారు దగ్ధం.. డిక్కీలో శవం: హత్య వెనుక వివాహేతర సంబంధం, మృతుని భార్య సంచలనం

శ్రీనివాస్ ను హత్య చేసి అదే కారులో ఆయన డెడ్‌బాడీతో కలిపి కారును దగ్ధం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆర్ధిక లావాదేవీలే ఇందుకు కారణంగా పోలీసులు గుర్తించారు.వరంగల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి నుండి కోటి రూపాయాలు,. హైద్రాబాద్ లో మరో రూ. 50 లక్షలు రావాల్సి ఉందని ధర్మకారి శ్రీనివాస్ బంధువులు చెప్పారు.

ఈ డబ్బుల కోసం ఆయన హైద్రాబాద్ వచ్చారని కుటుంబసభ్యులు చెప్పారు.  ఈ డబ్బుల కోసం వచ్చిన శ్రీనివాస్  కన్పించకుండా పోయాడు. ఆయనకారులోనే డెడ్‌బాడీ కాలినస్థితిలో పోలీసులు గుర్తించారు.రామాయంపేట వద్ద కారులోనే ధర్మకారి శ్రీనివాస్ ను హత్య చేశారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.  డెడ్ బాడీని కారులో తీసుకొని నిందితులు తిరిగారని పోలీసులు చెబుతున్నారు. రాత్రి పూట కారును మంగళపర్తి వద్ద దగ్ధం చేశారు.
 

click me!