BRS MLAs: ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఇలా నలుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి రేవంత్ రెడ్డిని కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. వారందరూ కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరందుకుంది. తాము మర్యాదపూర్వకంగానే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామంటూ ..ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చినా.. ప్రచారానికి బ్రేకులు వేయలేకపోయారు. దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
BRS MLAs: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలవడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఒక్కసారే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో ఆ ఎమ్మెల్యేలంతా ముకుమ్మడిగా కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ రోజు రాత్రే తాము మర్యాదపూర్వకంగా కలిశామని క్లారిటీ ఇచ్చినా.. పుకార్లకు మాత్రం బ్రేకులు పడలేదు. తమపై వస్తున్న ఆరోపణలను వ్యతిరేస్తూ.. తాము ఒక్క సారి కాదు.. వందసార్లు కలుస్తామని, తప్పుడు ప్రచారాలు చేస్తే.. పరువు నష్టం కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ తరుణంలో బుధవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డిని కూడా కలిశామని తెలిపారు. తనకు చాలా సమస్యలు ఉన్నందున ముఖ్యమంత్రితో మాట్లాడుతామని, ఇది చిన్న సమస్య అని, మా పార్టీకి మాపై పూర్తి విశ్వాసం ఉందని ప్రభాకర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సీఎం కాదా? కాంగ్రెస్ పార్టీనా? అంటూ ఎద్దేవా చేశారు. దుబ్బాకను రెవెన్యూ డివిజన్‌గా చేయాలని, రోడ్ల సమస్య కూడా లేవన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళతాం.. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి వెళ్లాలి.. ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు ప్రోటోకాల్‌లు ఇస్తున్నారని ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు. తాను కేంద్ర రైల్వే మంత్రిని, రోడ్లు & రహదారుల శాఖ మంత్రిని కూడా కలిశానని, మూడుసార్లు ప్రధానిని కూడా కలిశానని చెప్పారు. మూడు నాలుగు సార్లు సచివాలయానికి కూడా వెళ్లానన్నారు. ఇందులో ఏం తప్పు అని ప్రశ్నించారు.
అనంతరం ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం తమ హక్కు అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రధాని మోదీని కలిశారు. వాస్తవాలు వక్రీకరిస్తే పరువు నష్టం కేసులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తాను కూడా ప్రొటోకాల్ సమస్యలు ఎదుర్కొంటున్నానని తెలిపారు. అదనపు డీజీని కూడా కలిశా విద్యుత్ బిల్లులతో సహా వాగ్దానాలు అమలు చేయాలని డిమాండ్ చేశామనీ, దయచేసి వివరణ కోరండి కానీ పుకార్లు వ్యాప్తి చేయవద్దని సూచించారు.
మా పార్టీకి మాపై పార్టీకి నమ్మకం ఉంది, మా పార్టీ పట్ల మాకు గౌరవం ఉంది. నిన్నటి సమావేశం ప్రోటోకాల్ కోసం. ప్రభాకర్ అదనపు గన్ మెన్ కావాలన్నారు. మాకు రాజకీయ విలువలు ఉన్నాయి. మన పరువు తీయొద్దు. మా కార్మికులు అయోమయంలో ఉన్నారు కాబట్టి తాము నేడు మీడియా ముందుకు వస్తామని అన్నారు. ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని సునీతారెడ్డి అన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ..రేవంత్ రెడ్డిని ఒక్క సారి కాదు.. 100 సార్లు కలుస్తాం.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. అలాగే.. తాను బతికే ఉన్ననని రోజులు బీఆర్‌ఎస్‌ని వీడనని ఎమ్మెల్యే మాణిక్‌రావు మీడియాతో అన్నారు.