తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు.
తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రిగా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించనున్నాంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే.. ఈ ప్రచారం సంవత్సరకాలంగా జరుగుతున్నా.. ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. కాగా.. తాజాగా.. ఈ విషయం పై మేయర్ బొంతు రామ్మోహన్ క్లారిటీ ఇచ్చారు.
ఆయన మంగళవారం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. అనంతరం ఆలయం వెలుపల మేయర్ బొంతు రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. సమయం వచ్చినప్పుడు కేటీఆర్ సీఎం అవుతారని అన్నారు.
భగవంతుని కృపతో సందర్భం వచ్చినప్పుడు కేటీఆర్ సీఎం అవుతారనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ సమిష్టి నిర్ణయంతోనే కేటీఆర్ సీఎం అవుతారని స్పష్టం చేసారు. బంగారు తెలంగాణ సాధనకు మరింత శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించానని అన్నారు.