హైదరాబాద్‌‌లో భారీ అగ్నిప్రమాదం.. గ్రీన్ బావర్చి హోటల్‌లో ఎగసిపడుతున్న మంటలు..

Published : May 28, 2022, 12:16 PM IST
హైదరాబాద్‌‌లో భారీ అగ్నిప్రమాదం.. గ్రీన్ బావర్చి హోటల్‌లో ఎగసిపడుతున్న మంటలు..

సారాంశం

హైదరాబాద్ రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రీన్ బావర్చి హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. 

హైదరాబాద్ రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రీన్ బావర్చి హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే  ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. అయితే దట్టమైన పొగలు అలుముకోవడంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఇబ్బందులు ఎదురువుతున్నాయి. 

ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో ఉన్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భవనం లోపల ఎంతమంది ఉన్నారనే విషయం స్పష్టత లేకుండా పోయింది. అయితే అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో భవనం పైకి ఎక్కిన కొందరు తమను రక్షించాలని కేకలు వేస్తున్నారు. దీంతో భవనం పైనున్నవారిని క్షేమంగా తీసుకురావడానికి ల్యాడర్‌ను పంపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu