సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్దమైన క్లబ్.. రూ. 20 కోట్ల ఆస్తి నష్టం..!

Published : Jan 16, 2022, 09:19 AM IST
సికింద్రాబాద్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్దమైన క్లబ్.. రూ. 20 కోట్ల ఆస్తి నష్టం..!

సారాంశం

సికింద్రాబాద్ క్లబ్‌లో (secunderabad club) భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని కీలలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో క్లబ్ మొత్తం మంటలు వ్యాపించి.. పూర్తిగా దగ్దమైంది.

సికింద్రాబాద్ క్లబ్‌లో (secunderabad club) భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు అగ్నిప్రమాదం సంభవించింది. అగ్ని కీలలు భారీగా ఎగసిపడ్డాయి. దీంతో క్లబ్ మొత్తం మంటలు వ్యాపించి.. పూర్తిగా దగ్దమైంది. ఇది గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 10 ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ. 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. భారీగా మంటలు ఎగసిపడటంతో సమీప ప్రాంతాల్లో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. 

అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 1878లో బ్రిటీష్‌ హయాంలో మిలటరీ అధికారులు కోసం ఈ క్లబ్‌ నిర్మించారు.. దాదాపు 20 ఎకరాల విస్తీరణంలో సికింద్రాబాద్‌ క్లబ్‌ను నిర్మించారు. భారతీయ వారసత్వ సంపదగా 2017లో గుర్తించి పోస్టల్‌ కవర్‌ విడుదల చేశారు. ఈ క్లబ్‌లో 5వేల మందికి పైగా సభ్యత్వం ఉంది. సంక్రాంతి కావడంతో శనివారం క్లబ్‌ను ముసివేసినట్లు తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu