మాస్క్ తో మోసం.. తెలిసిన వ్యక్తిలా పలకరించి, డబ్బులకు టోకరా...!

By AN TeluguFirst Published Jul 20, 2021, 10:55 AM IST
Highlights

లక్ష్మీ నారాయణ వెనుకే ఆయన ఇంటి గుమ్మ దాకా వెళ్లాడు. తెలిసిన వ్యక్తిలా మాటలు కలిపాడు. అనుమానం రాకుండా చేసి, చిల్లర తీసుకున్నాడు. ఆ తరువాత దాహంగా ఉందని మంచినీళ్లు అడిగాడు. దీంతో ఆయన తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లగా తీసుకున్న చిల్లరకు డబ్బులు ఇవ్వకుండానే ఉడాయించాడు. 

ఖమ్మం : ఈ కరోనా కాలంలో అందర మాస్కులు పెట్టుకోవడం మామూలై పోయింది. దీన్నే ఓ మోసగాడు బాగా ఉపయోగించుకున్నాడు. తన దొంగ తెలివి ప్రదర్శించాడు. సిద్ధారం గ్రామానికి చెందిన గుళ్లపల్లి లక్ష్మీనారాయణకు చెందిన చికెన్ సెంటర్ దగ్గరికి మాస్క్ పెట్టుకున్న ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తనకు రూ.7 వేలకు రూ.100, రూ.50 నోట్ల చిల్లర కావాలని అడిగాడు.

దీంతో లక్ష్మీ నారాయణ వెనుకే ఆయన ఇంటి గుమ్మ దాకా వెళ్లాడు. తెలిసిన వ్యక్తిలా మాటలు కలిపాడు. అనుమానం రాకుండా చేసి, చిల్లర తీసుకున్నాడు. ఆ తరువాత దాహంగా ఉందని మంచినీళ్లు అడిగాడు. దీంతో ఆయన తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లగా తీసుకున్న చిల్లరకు డబ్బులు ఇవ్వకుండానే ఉడాయించాడు. 

కాసేపటికి నీళ్ల గ్లాసుతో బైటికొచ్చిన లక్ష్మీ నారాయణ అతను కనిపించకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే స్థానిక పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సీసీ కెమెరా దృశ్యాలు పరిశీలించాడు. అతను ద్విచక్రవాహనం మీద వచ్చినట్లు ఫుటేజీ లభించింది.

అయితే అతను వచ్చిన ఫ్యాషన్ ప్రో బండికి ముందు, వెనక నెంబర్ ప్లేట్లు లేవు. దీంతో తనలా మరొకరు మోసపోకూడదని ఆ విజువల్స్ ను తను మోసపోయిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాధితుడు గుళ్లపల్లి లక్ష్మీ నారాయణ కుమారుడు వెంకట్రామయ్య దీన్ని పోస్ట్ చేసిన వెంటనే మరికొందరు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. 

తాము కూడా ఇదే తరహాలో మాస్క్ మాటున మోసపోయామని బాధితులు వాపోయారు. తాము పోలీసులకు ఫిర్యాదు చేశామని, నిందితుడు సత్తుపల్లి, కాకర్లపల్లి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు తెలిపారు. మాస్క్ పెట్టుకున్న అపరిచిత వ్యక్తుల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని బాధితులు కోరుతున్నారు. 

click me!