హుజూరాబాద్ బైపోల్: రేపు టీఆర్ఎస్‌లోకి కౌశిక్ రెడ్డి

By narsimha lodeFirst Published Jul 20, 2021, 10:00 AM IST
Highlights

 కాంగ్రెస్‌ నుండి బహిష్కరణకు గురైన కౌశిక్ రెడ్డి   టీఆర్ఎస్‌లో చేరనున్నారు. గతంలోనే ఆయన  ఆడియో సంభాషణ పెద్ద ఎత్తున కలకలం రేపిన వషయం తెలిసిందే. 
 

హైదరాబాద్: కాంగ్రెస్ నుండి బహిష్కరణకు గురైన హుజూరాబాద్ కు చెందిన కౌశిక్ రెడ్డి ఈ నెల 21న టీఆర్ఎస్‌లో చేరనున్నారు.  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పలువురు కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డిపై ఆ పార్టీ బహిష్కరణ వేటేసిన విషయం తెలిసిందే.

హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా తానే బరిలోకి దిగనున్నట్టుగా కౌశిక్ రెడ్డి ఆడియో సంభాషణ  వైరల్ గా మారింది.దీనిపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది.  అయితే  కాంగ్రెస్ పార్టీ  కీలక నేతలపై కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఆయనపై పార్టీ బహిష్కరణ వేటేసింది. ఆ తర్వాత కౌశిక్ రెడ్డి  పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు.

also read:కౌశిక్​రెడ్డికి మరో షాక్: లీగల్ నోటీసులు పంపిన మాణిక్యం ఠాగూర్, క్షమాపణకు డిమాండ్

రేపు  టీఆర్ఎస్ లో కౌశిక్ రెడ్డి చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి చేరుతారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ కౌశిక్ రెడ్డి  మీడియాతో మాట్లాడనున్నారు.హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలను టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. హుజూరాబాద్ కు చెందిన ఇతర పార్టీలకు చెందిన నేతలకు టీఆర్ఎస్ గాలం వేస్తోంది. ఇప్పటికే  కాంగ్రెస్ కు చెందిన కశ్యప్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.
 

click me!