ఎగురుతున్న విమానంలోనే... హైదరాబాద్ యువతిపై కామారెడ్డి వాసి లైంగిక వేధింపులు (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Jul 20, 2021, 10:26 AM ISTUpdated : Jul 20, 2021, 10:38 AM IST
ఎగురుతున్న విమానంలోనే...  హైదరాబాద్ యువతిపై కామారెడ్డి వాసి లైంగిక వేధింపులు (వీడియో)

సారాంశం

మస్కట్ నుండి హైదరాబాద్ కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళా ప్యాసింజర్ ను తోటి ప్రయాణికుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో అతడిని గన్నవరం పోలీసులు అరెస్ట్ చేశారు. 

మస్కట్ నుండి  హైదరాబాద్ కు వస్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలితో ఓ కామాంధుడు అసభ్యంగా ప్రవర్తించి లైంగికంగా వేధించాడు. దీంతో యువతి అతడి చేష్టలను ఉపేక్షించకుండా గన్నవరం విమానాశ్రయ అధికారుల సాయంతో స్థానిక పోలీసులకు సదరు నిందితున్ని అప్పగించారు.  

వివరాల్లోకి వెళితే... అరుణ అనే మహిళ మస్కట్ నుండి ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్ కు వస్తోంది. ఇదే విమానంలో కామారెడ్డి వాసి లక్ష్మణ్ కు హైదరాబాద్ కు బయలుదేరాడు. వీరిద్దరు పక్కపక్క సీట్లలో కూర్చున్నారు. విమానం టేకాఫ్ అయిన తర్వాత లక్ష్మణ యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అతడి చేష్టలతో విసిగిపోయిన సదరు మహిళ విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. 

వీడియో

మహిళ లైంగిక వేధింపుల ఫిర్యాదుతో విమానం కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఆగగానే సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గన్నవరం పోలీసులు నిందితుడు లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకున్నారు. 

అయితే లక్ష్మణ మానసిక పరిస్థితి బాగాలేదని తెలుస్తోందని గన్నవరం పోలీసులు తెలిపారు. అతడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామన్నారు. అతడి మానసిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకున్నాక కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.