మారుతీరావు కి తలకొరివి పెట్టనున్న తమ్ముడు, అమృతకు దక్కని అవకాశం

By telugu news teamFirst Published Mar 9, 2020, 10:23 AM IST
Highlights

తన వద్దకు కూతురు రాకపోవడం.. మరోవైపు సోదరుడితో ఆస్తి తగాదాలు, మరోవైపు ప్రణయ్ హత్య కేసు నిందితులు డబ్బు కోసం ఒత్తిడి చేయడం తదితర కారణాల వల్ల మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరికాసేపట్లో మారుతీరావు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మిర్యాలగూడలోని  హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు చేయనున్నారు.  కాగా...మారుతీరావుకి ఆయన సోదరుడు శ్రవణ్.. తలకొరివి పెట్టనున్నారు.

అయితే..  కడసారి తండ్రిని చూడాలని అమృత ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆమె తండ్రిని కడసారి చూడాలని భావించినా.. ఆమె రాకను బాబాయ్ శ్రవణ్ నిరాకరించారు. దీంతో... తనకు పోలీసుల భద్రత కావాలంటూ అమృత  కోరుతోంది. తనకు పోలీసులకు భద్రతగా నిలిస్తే .. చివరిసారిగా తండ్రి శవాన్ని చూస్తానని ఆమె పోలీసులను వేడుకోవడం గమనార్హం. అయినప్పటికీ అమృత రాకుండానే మారుతీరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీంతో... ఆమె చివరి చూపు కూడా దక్కించుకోలేకపోయింది. 

Also Read మారుతీరావు అంత్యక్రియలు... కడసారి తండ్రిని చూసేందుకు అమృత...

ఇదిలా ఉండగా... మారుతీరావు మృతదేహానికి ఎమ్మెల్యే భాస్కర్ రావు నివాళులర్పించారు. కాగా.. సరిగ్గా సంవత్సరం క్రితం కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించిదనే కారణంతో.. మారుతీ రావు.. ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేయించాడు. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు... ప్రస్తుతం బెయిల్ మీద బయటఉన్నాడు. అయితే సడెన్ గా ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో... ఈ సంఘటన మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

ప్రణయ్ హత్య తర్వాత కూతురు తన వద్దకు వస్తుందని మారుతీరావు చాలా ఆశపడ్డాడు. అలా జరగకపోవడంతో చాలాసార్లు రాయబారం పంపాడు. అయినా తన వద్దకు కూతురు రాకపోవడం.. మరోవైపు సోదరుడితో ఆస్తి తగాదాలు, మరోవైపు ప్రణయ్ హత్య కేసు నిందితులు డబ్బు కోసం ఒత్తిడి చేయడం తదితర కారణాల వల్ల మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా.. ఆత్మహత్య కు ముందు మారుతీరావు సూసైడ్ నోట్ కూడా రాశాడు. అందులో  భార్య గిరిజను క్షమించమని కోరుతూ.. తాను చనిపోయిన తర్వాత అమృత తన తల్లి వద్దకు రావాలంటూ పేర్కొనడం గమనార్హం. 

click me!