మారుతీరావు అంత్యక్రియలు... కడసారి తండ్రిని చూసేందుకు అమృత

Published : Mar 09, 2020, 09:36 AM ISTUpdated : Mar 09, 2020, 09:39 AM IST
మారుతీరావు అంత్యక్రియలు... కడసారి తండ్రిని చూసేందుకు అమృత

సారాంశం

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు... ప్రస్తుతం బెయిల్ మీద బయటఉన్నాడు. అయితే సడెన్ గా ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో... ఈ సంఘటన మరోసారి వార్తల్లోకి ఎక్కింది.  


మిర్యాలగూడలో సోమవారం మారుతీరావు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా... కడసారి తండ్రిని చూడాలని అమృత ప్రయత్నాలు చేస్తోంది. అయితే... అమృత రావడానికి మారుతీరావు సోదరుడు, ఆమె బాబాయి నిరాకరిస్తున్నాడు. దీంతో... తనకు పోలీసుల భద్రత కావాలంటూ అమృత  కోరుతోంది. తనకు పోలీసులకు భద్రతగా నిలిస్తే .. చివరిసారిగా తండ్రి శవాన్ని చూస్తానని ఆమె పోలీసులను వేడుకోవడం గమనార్హం.

Also Read వీడని మారుతీ రావు మృతి మిస్టరీ: ఆ రెండు గంటలు ఏం జరిగింది?...

కాగా.. సరిగ్గా సంవత్సరం క్రితం కూతురు తక్కువ కులం వాడిని ప్రేమించిదనే కారణంతో.. మారుతీ రావు.. ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేయించాడు. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు... ప్రస్తుతం బెయిల్ మీద బయటఉన్నాడు. అయితే సడెన్ గా ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో... ఈ సంఘటన మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

ప్రణయ్ హత్య తర్వాత కూతురు తన వద్దకు వస్తుందని మారుతీరావు చాలా ఆశపడ్డాడు. అలా జరగకపోవడంతో చాలాసార్లు రాయబారం పంపాడు. అయినా తన వద్దకు కూతురు రాకపోవడం.. మరోవైపు సోదరుడితో ఆస్తి తగాదాలు, మరోవైపు ప్రణయ్ హత్య కేసు నిందితులు డబ్బు కోసం ఒత్తిడి చేయడం తదితర కారణాల వల్ల మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాగా.. ఆత్మహత్య కు ముందు మారుతీరావు సూసైడ్ నోట్ కూడా రాశాడు. అందులో తాను చనిపోయిన తర్వాత అమృత తన తల్లి వద్దకు రావాలంటూ పేర్కొనడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?