యువతిని చంపి సంచిలో కుక్కి.. నీటిలో కొట్టుకుపోకుండా చెట్టుకు కట్టారు

sivanagaprasad kodati |  
Published : Nov 09, 2018, 01:53 PM IST
యువతిని చంపి సంచిలో కుక్కి.. నీటిలో కొట్టుకుపోకుండా చెట్టుకు కట్టారు

సారాంశం

నిజామాబాద్ జిల్లాలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన కూడలి అనిత అలియాస్ అనూష గత నెల 22వ తేదీ నుంచి కనిపించకపోవడంతో ఆమె భర్త రాజశేఖర్ చుట్టుపక్కల ప్రాంతంతో పాటు బంధువుల ఇళ్లలో వెతికాడు

నిజామాబాద్ జిల్లాలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన కూడలి అనిత అలియాస్ అనూష గత నెల 22వ తేదీ నుంచి కనిపించకపోవడంతో ఆమె భర్త రాజశేఖర్ చుట్టుపక్కల ప్రాంతంతో పాటు బంధువుల ఇళ్లలో వెతికాడు.

ఎక్కడా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో ఇసాయిపేట గ్రామశివారులోని అటవీ ప్రాంతంలోని వాగులో చేపలో పట్టడానికి వెళ్లిన వారికి నీటి ప్రవాహంలో తేలుతూ ఒక మూట కనిపించింది.

దగ్గరకు వెళ్లి చూడగా అందులో ఓ యువతి మృతదేహం కుల్లిన స్థితిలో ఉంది. వెంటేనే పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అయితే భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన రాజశేఖర్‌ విషయం గుర్తొచ్చి.. వెంటనే అతన్ని పిలిపించారు. ఆమె ఒంటిపై ఉన్న దుస్తులు, ఆభరణాలను బట్టి మృతురాలు తన భార్యేనని అతను గుర్తించాడు.

రాజశేఖర్, అనితలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడాదిన్నర వయసున్న బాబు కూడా ఉన్నారు.. అయితే వీరి పెళ్లి రాజశేఖర్ తల్లిదండ్రులకు ఇష్టం లేనట్లుగా గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిత హత్య మిస్టరీని ఛేదించేందుకు దర్యాప్తు చేపట్టారు. 

 


 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu