నా భర్త నాకు కావాలంటూ... వివాహిత ఆందోళన

Published : Aug 12, 2019, 09:48 AM IST
నా భర్త నాకు కావాలంటూ... వివాహిత ఆందోళన

సారాంశం

ఇందిరానగర్‌లోని అత్తింటికి వచ్చి తన భర్త తనకు కావాలని ఆందోళన చేపట్టింది. ఆ సమయంలో వాసుతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సునితను అక్కడ్నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.

తన భర్త తనకు కావాలంటూ ఓ వివాహిత అత్తారింటి ఎదుట ఆందోళన చేపట్టింది. ఈ సంఘటన పాల్వంచ పట్టణంలో చోటుచేసుకుంది. భర్తత తనతో సరిగా ఉండటం లేదని... తనకు తన భర్త కావాలంటూ ఆమె ఆందోళన చేయడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... బుర్గంపాడు మండలం సారపాకకు చెందిన సునితకు పాల్వంచ మండలం ఇందిరానగర్‌ కాలనీకి చెందిన వాసుతో గతేడాది వివాహమైంది. వీరికి ఆరు నెలల పాపాయి కూడా ఉంది. కాగా.. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య విబేదాలు చోటుచేసుకుంటున్నాయి. కొద్దిరోజుల క్రితం సునిత పుట్టింటికి వెళ్లింది. 

ఆదివారం ఇందిరానగర్‌లోని అత్తింటికి వచ్చి తన భర్త తనకు కావాలని ఆందోళన చేపట్టింది. ఆ సమయంలో వాసుతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సునితను అక్కడ్నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. భర్త వద్దే ఉంటానంటూ ఆమె భీష్మించుకు కూర్చుంది. దీంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించిన పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?