సినిమా తీసి లాభాలిస్తానని.. సినిమా చూపించాడు, 80 లక్షలకు టోకరా

By Siva KodatiFirst Published Aug 12, 2019, 9:42 AM IST
Highlights

సినీ పరిశ్రమలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు కళ్లజూడవచ్చ అని మభ్యపెట్టి రూ.80 లక్షలు మోసం చేసిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై గోపాలపురం, నారాయణ గూడ పోలీస్ స్టేషన్లలో గతంలో క్రిమినల్ కేసులు నమోదైనట్లు గుర్తించారు. 

సినీ పరిశ్రమలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు కళ్లజూడవచ్చ అని మభ్యపెట్టి రూ.80 లక్షలు మోసం చేసిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బౌరంపేటకు  చెందిన సి. వెంటకటేశ్వర్లు అలియాస్ సిరిమల్లె వెంకటేశ్వర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారి అతను సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు.

దీనిలో భాగంగా సిరిమల్లె ప్రొడక్షన్స్, అవికాన్ స్టూడియో పేరిట యానిమేషన్ సంస్ధను ప్రారంభించి..  హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్డు నెం.71లోని ఖరీదైన ప్రాంతంలో కార్పోరేట్ స్థాయిలో ఆఫీస్ ఏర్పాటు చేశాడు.

త్వరలో పెద్ద ఎత్తున సినిమాలు నిర్మిస్తున్నట్లు తెలిసిన వారందరికీ చెప్పాడు. ఈ క్రమంలో దుండిగల్‌కు చెందిన జి. పాండురంగనాథ్‌ అతని బుట్టలో పడ్డాడు. తన నిర్మాణ సంస్థలో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు అందజేస్తానని మాయమాటలు చెప్పాడు.

ఇది నమ్మిన పాండురంగనాథ్ దాదాపు రూ. 80 లక్షలు ఇచ్చాడు. అయితే నెలలు గడుస్తున్నా వెంకటేశ్వర్లు మాత్రం సినిమా నిర్మాణాన్ని ప్రారంభించకపోవడంతో అతనిని పలుమార్లు నిలదీశాడు.

దీనికి వెంకటేశ్వర్లు వద్ద నుంచి సరైన సమాధానం లభించకపోగా రేపు, మాపు అంటూ తిప్పించుకున్నాడు. దీంతో తన డబ్బు తనకు తిరిగి ఇచ్చే యాలని పాండురంగనాథ్ అడగటంతో వెంకటేశ్వర్లు ఎదురు తిరిగడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డాడు.

దీంతో పాండు రంగనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వెంకటేశ్వర్లును అరెస్ట్ చేశారు. కాగా ఇతనిపై గోపాలపురం, నారాయణ గూడ పోలీస్ స్టేషన్లలో గతంలో క్రిమినల్ కేసులు నమోదైనట్లు గుర్తించారు. 

click me!