ఆర్టికల్ 370 రద్దు: ఏపీ, తెలంగాణలో స్పెషల్ జోన్లు సేఫేనా?

By narsimha lodeFirst Published Aug 12, 2019, 7:02 AM IST
Highlights

కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయంప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 రద్దుతో ఇతర రాష్ట్రాల్లో కూడ కల్పించిన సౌకర్యాలపై చర్చ సాగుతోంది.

హైదరాబాద్:జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 ను రద్దు చేయడంతో 371 డి ఆర్టికల్ విషయమై చర్చకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 371 డి ఆర్టికల్ ద్వారా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.

ఈ సౌకర్యాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకొంటుందా అనే చర్చ సర్వత్రా నెలకొంది. అయితే ఆ అవకాశం లేదని పార్లమెంట్ లో  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముల్కీ నిబంధనలను తుంగలో తొక్కారనే విషయమై ఆందోళనలు కొనసాగిన సమయంలో ఆర్టికల్ 371 డి ద్వారా ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు.

ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉద్యోగ, ఉపాధి విషయాల్లో సమానత్వాన్ని పాటించేందుకు ఆర్టికల్ 371 డి ద్వారా జోన్లను ఏర్పాటు చేశారు.
స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు, విద్య అవకాశం కల్పించేందుకు ఆర్టికల్ 370 డి పనిచేస్తోంది.

2014లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను విభజించారు. ఈ సమయంలో కూడ ఏపీ పునర్విభజన బిల్లులో సెక్షన్ 95 ద్వారా ఈ ఆర్టికల్ ను అలానే ఉంచారు.ఆర్టికల్ 370 రద్దు ద్వారా దేశ వ్యాప్తంగా ఆర్టికల్ 371 డి గురించి చర్చ సాగుతోంది.

ఆర్టికల్ 371 డి ద్వారా స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయి. ఈ ఆర్టికల్ ద్వారా ప్రత్యేకమైన స్వయంప్రతిపత్తి మాత్రం రాదు. జోనల్ వ్యవస్థ ద్వారా ఉద్యోగ, ఉపాధిలో స్థానికులకు ప్రాధాన్యత దక్కనుంది.

ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్టికల్ 371 ఈ, ఎఫ్, ఐ, జే వంటి సెక్షన్ల ద్వారా మరికొన్ని సౌకర్యాలు కల్పించింది రాజ్యాంగం స్థానిక ప్రజలకు. ఈశాన్య రాష్ట్రాల్లోని స్థానికులకు భూమిపై హక్కును ప్రభుత్వం కల్పించింది.

ఆర్టికల్ 371 డి విషయంలో ఏమైనా చేయాలని కేంద్రం చూస్తే టీఆర్ఎస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం ఉంది. ఈ విషయమై ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వినోద్ కుమార్ అబిప్రాయపడుతున్నారు.

ఆర్టికల్ 371 డి విషయాన్ని కేంద్రం కూడ టచ్ చేసే అవకాశం ఉండదని బీజేపీ నేతలు కూడ అభిప్రాయంతో ఉన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రం విభజనకు గురైన ఆయా ప్రాంతాల్లో  ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో సమానత్వం ఈ ఆర్టికల్ అలానే కొనసాగుతోంది.

click me!