మా ఆయన చాలా మంచోడు అని మెసేజ్ చేసి... మహిళ ఆత్మహత్య

Published : Jan 22, 2020, 12:33 PM IST
మా ఆయన చాలా మంచోడు అని మెసేజ్ చేసి... మహిళ ఆత్మహత్య

సారాంశం

వీరి సంసారం ఆనందంగానే సాగుతోంది. ఉన్నట్టుండి స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు స్వాతి.. భర్తను మిస్సవుతున్నాను.. మా ఆయన ఎంతో మంచివాడు. తల్లిదండ్రులు, పిల్లలను బాగా చూసుకోండంటూ పలువురికి ఫోన్‌లో ఎస్‌ఎంఎస్‌లు పంపించింది.  

‘మా ఆయన  చాలా మంచోడు.. ఆయనను బాగా మిస్సవుతున్నాను.. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ తన పుట్టింటి వారికి ఫోన్ లో మెసేజ్ పెట్టి మరీ ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని సనత్ నగర్ లో చోటుచేసుకంుది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  మోతీనగర్ కబీర్ నగర్ లో నివాసం ఉండే రమేష్ గౌడ కి కొన్ని సంవత్సరాల క్రితం స్వాతి(32) తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం కూడా ఉన్నారు.  రమేష్ గౌడ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోత్కూర్ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు.

కాగా... వీరి సంసారం ఆనందంగానే సాగుతోంది. ఉన్నట్టుండి స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలో మంగళవారం ఆత్మహత్యకు పాల్పడటానికి ముందు స్వాతి.. భర్తను మిస్సవుతున్నాను.. మా ఆయన ఎంతో మంచివాడు. తల్లిదండ్రులు, పిల్లలను బాగా చూసుకోండంటూ పలువురికి ఫోన్‌లో ఎస్‌ఎంఎస్‌లు పంపించింది.

Also Read పెళ్లికావాలంటే... దెయ్యం వదలాలి..నయా మోసం తెరపైకి...  

మోతీనగర్‌ సమీపంలో ఉంటున్న సోదరుడికి ఫోన్‌ చేసి ‘తాను చనిపోతున్నానంటూ చెప్పింది. దీంతో వారు హుటాహుటిన చేరుకుని ఇంటితలుపులను పగులగొట్టి చూడగా ఇంట్లోని ఫ్యాన్‌కు స్వాతి ఉరేసుకుని కనిపించింది. కొనఊపిరితో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలిపారు.

అయితే... ఆమె అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుందో తెలియరాలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్