టీలో టీపొడి ఎక్కువ వేసిందని గొడవ.. మహిళ ఆత్మహత్య

Published : May 04, 2021, 08:52 AM ISTUpdated : May 04, 2021, 08:53 AM IST
టీలో టీపొడి ఎక్కువ వేసిందని గొడవ.. మహిళ ఆత్మహత్య

సారాంశం

ఆ టీలో టీపొడి ఎక్కువగా వేశావంటూ అత్త సఫియా బేగం.. బీబీని కాస్త గట్టిగానే మందలించారు. అంతే.. అత్త అలా మందలించడంతో మనస్తాపానికి గురైన బీబీ.. తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరి వేసుకుంది.

టీలో టీపొడి ఎక్కువ వేశావని అత్త.. తన కోడలిని మందలించింది. అంతే.. ఆ మాత్రానికే వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన గోల్కోండలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గోల్కొండ రేషమ్ బాగ్ కు చెందిన సయ్యద్ హబీద్ ఓ వ్యాపారి. ఆయనకు భార్య బీబీ(24), తల్లి సఫియాబేగం ఉన్నారు. కాగా.. ఈ నెల 1వ తేదీన సఫియా బేగం.. కోడలు బీబీని టీ ఇవ్వాలని కోరారు. అత్త కోరినట్లుగానే బీబీ టీ పెట్టి తీసుకువచ్చింది.

అయితే.. ఆ టీలో టీపొడి ఎక్కువగా వేశావంటూ అత్త సఫియా బేగం.. బీబీని కాస్త గట్టిగానే మందలించారు. అంతే.. అత్త అలా మందలించడంతో మనస్తాపానికి గురైన బీబీ.. తన గదిలోకి వెళ్లి ఫ్యాన్ కి ఉరి వేసుకుంది.

ఎంతసేపటికీ తలుపు తెరవకపోయే సరికి అనుమానం వచ్చి.. డోర్ పగల కొట్టి చూడగా.. అప్పటికే బీబీ ఆత్మహత్య చేసుకొని కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana Jobs : 2026 లో నిరుద్యోగుల కలలు నిజం... ఇన్ని వేల పోస్టుల భర్తీనా..!
IMD Cold Wave Alert : ఇక చలిగాలులకు బ్రేక్ ... ఈ వారంరోజులు రిలాక్స్.. తర్వాత మళ్ళీ గజగజే..!