రెండు రోజుల్లో పరిస్థితులు మారే ఛాన్స్, నా భవిష్యత్తు కార్యాచరణ చెబుతా: ఈటల రాజేందర్

By narsimha lodeFirst Published May 3, 2021, 10:04 PM IST
Highlights

రెండు రోజుల్లో పరిస్థితి మారే అవకాశం ఉందని మాజీ మంత్రి, ఈటల రాజేందర్ చెప్పారు.హైద్రాబాద్ నుండి తన నియోజకవర్గమైన హుజూరాబాద్ కు  సోమవారం నాడు  భారీ కాన్వాయ్‌తో ఆయన చేరుకొన్నారు. ఈ సందర్భంగా తన అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో  మాట్లాడారు. 

హుజురాబాద్:  రెండు రోజుల్లో పరిస్థితి మారే అవకాశం ఉందని మాజీ మంత్రి, ఈటల రాజేందర్ చెప్పారు.హైద్రాబాద్ నుండి తన నియోజకవర్గమైన హుజూరాబాద్ కు  సోమవారం నాడు  భారీ కాన్వాయ్‌తో ఆయన చేరుకొన్నారు. ఈ సందర్భంగా తన అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో  మాట్లాడారు. ప్రజలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత  తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన  చెప్పారు. 19 ఏళ్లుగా తనతో నడుస్తున్న నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

also read:ఈటలకు మరో షాక్: ఎక్స్‌ట్రా సెక్యూరిటీ వెనక్కి, హుజూరాబాద్‌కి రాజేందర్

త్వరలోనే  తన  ప్రయాణం గురించి తెలుపుతానని ఆయన ప్రకటించారు. మెదక్ జిల్లాలోని మాసాయిపేట, హకీంపేటల్లో ఈటల రాజేందర్  అసైన్డ్  భూములను ఆక్రమించుకొన్నారని కలెక్టర్ నివేదిక ఇవ్వడంతో   మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను భర్తరఫ్ చేస్తూ  కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేయాలని  ఈటల రాజేందర్ భావిస్తున్నారు. ఈ విషయమై ఆయన తన అనుచరులతో  సంప్రదింపులు జరపనున్నారు. రేపు ఆయన  అనుచరులతో సమావేశం కానున్నారు. 

click me!