
పెళ్లి చేసుకొనే సమయానికి వధువు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో పాలైంది. ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగి చికిత్స పొందుతోంది. అయినా.. పెళ్లి ఎందుకని వాయిదా వేయాలని భావించిన ఇరు కుటుంబాల పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారు. నిశ్చయించుకున్న ముహుర్తానికే పెళ్లి చేయాలని భావించారు. ఆస్పత్రి అయినా .. కల్యాణ మండపమైనా తేడా ఏముందని భావించారోమో గానీ.. ఐసీయూలోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు.
అనుకున్నదే తడువుగా.. వరుడుని ఆస్పత్రికి తీసుకొని వెళ్లారు. ఆ వరుడు ఆసుపత్రిలోనే బెడ్ పై చిక్సిత పొందుతున్న వధువు మెడలో తాళి కట్టి కట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. వేద మంత్రాలు చదువుతుంటే వధువు మెడలో అతడు తాళి కట్టడంతో మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మొత్తానికి హాస్పిటల్ లోనే వివాహ తంతు పూర్తయింది. ఈ సంఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతికి గత నెల మ్యారేజ్ ఫిక్సయ్యింది. నిర్ణయించిన ముహూర్తం ప్రకారం.. గురువారం వివాహం జరగాల్సింది. కానీ, ఒక రోజు ముందు(బుధవారం) వధువు అస్వస్థత గురైంది. దీంతో కుటుంబీకులు వెంటనే ఆ వధువును మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వధువు పరిస్థితి కొంచెం సీరియస్ ఉండటంతో అదే రాత్రి వైద్యులు ఆపరేషన్ చేశారు.ప్రస్తుతం ఆమె ఐసీయూలో చిక్సిత పొందుతోంది. అయితే, పెళ్లి వాయిదా వేయడం ఎందుకని భావించిన ఇరు కుటుంబాల పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. అనుకున్న ముహుర్తానికి ఆస్పత్రిలోనే ఐసీయూ బెడ్‌పై పెళ్లి నిర్వహించారు.
ఇంకేముందు.. వరుడు తిరుపతిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలోనే బెడ్ పై ఉన్న శైలజకు అనుకున్న ముహుర్తం సమయంలోనే అందరి సమక్షంలో తాళి కట్టి భార్యగా చేసుకున్నాడు. అనంతరం ఇరువురు దండలు మార్చుకొని పెద్దల ఆశీస్సులు పొందారు. పెళ్ళి అనంతరం మీఠాయిలు తినిపించారు. ఆసుపత్రిలో పెళ్ళి జరిగిన విషయం తెలిసి అందరు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే.. గతంలోనూ ఆస్పత్రిలో పెళ్లిలు అయిన ఘటనలున్నాయి. మొత్తంగా ఈ పెళ్లి ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతూనే.. నవదంపతులకు విషెస్ చెబుతున్నారు.