తుది ఓటర్ల జాబితాలో కూడ సవరణలు: మర్రి శశిధర్ రెడ్డి

By narsimha lodeFirst Published Oct 10, 2018, 4:34 PM IST
Highlights

తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత కూడ  జాబితాలో ఓటర్లను చేర్చడం... బోగస్ ఓటర్లను తొలగించాలని హైకోర్టు  ఈసీని  ఆదేశించిందని  కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: తుది ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత కూడ  జాబితాలో ఓటర్లను చేర్చడం... బోగస్ ఓటర్లను తొలగించాలని హైకోర్టు  ఈసీని  ఆదేశించిందని  కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు.

ఓటర్ల జాబితాలో అవకతవలపై  హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం నాడు విచారణ జరిపింది. ఈ కేసు విచారణకు సంబంధించిన వివరాలను  మర్రి శశిధర్ రెడ్డి  మీడియాకు వివరించారు.

వాస్తవానికి  ఓటర్ల జాబితా తుది జాబితా విడుదల చేసిన తర్వాత బోగస్ ఓట్ల  తీసివేత మినహా చేర్చే ప్రక్రియ ఉండదన్నారు. కానీ  తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని  తుది జాబితాను ప్రకటించిన తర్వాత కూడ కొత్త ఓట్ల చేర్పింపు,  బోగస్ ఓట్ల ఏరివేతకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఈసీని ఆదేశించిందన్నారు.

అయితే ఓట్ల చేర్పింపు, ఓట్ల ఎత్తివేతలకు సంబంధించి ఏ రకంగా చర్యలు తీసుకొంటారనే విషయమై  అఫిడవిట్ దాఖలు చేయాలని  కోర్టు  ఈసీని  ఆదేశించిందని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని  కోర్టు అభిప్రాయపడినట్టుగా  మర్రి శశిధర్ రెడ్డి గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అసెంబ్లీ రద్దుపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై 200 పిల్స్ దాఖలు

30 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు: హైకోర్టులో ఈసీ కౌంటర్


 

click me!