అసెంబ్లీ రద్దుపై తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

By narsimha lodeFirst Published Oct 10, 2018, 3:52 PM IST
Highlights

ఓటర్ల జాబితా అవకతవకలపై  కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి  దాఖలు చేసిన పిటిషన్‌పై  విచారణను  హైకోర్టు  అక్టోబర్ 12 వ తేదీకి వాయిదా వేసింది.


హైదరాబాద్: ఓటర్ల జాబితా అవకతవకలపై  కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి  దాఖలు చేసిన పిటిషన్‌పై  విచారణను  హైకోర్టు  అక్టోబర్ 12 వ తేదీకి వాయిదా వేసింది.

రెండు రోజుల  క్రితం ఈ కేసు  విచారణ జరిగింది. ఇవాళ ఉదయం నుండి  కోర్టు  ఈ కేసు విషయమై  వాదనలను వింది.  మర్రి శశిధర్ రెడ్డితో పిటిషన్‌పై  జంధ్యాల రవిశంకర్ తన వాదనలను విన్పించారు.

ఇదిలా ఉంటే అక్టోబర్ 12న  ఓటర్ల జాబితాను విడుదల చేయాలని కోర్టు ఈసీకి అనుమతి ఇచ్చినట్టు సమాచారం. మరోసారి అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉంటే  అసెంబ్లీ రద్దుపై మాజీ మంత్రి డీకె అరుణతో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధసంఘాల ప్రతినిధులు దాఖలు చేసిన 200 పిటిషన్లపై  ఒక్క పిటిషన్‌గా స్వీకరించిన కోర్టు విచారణ చేసింది. ఈ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.

సంబంధిత వార్తలు

తెలంగాణ అసెంబ్లీ రద్దుపై 200 పిల్స్ దాఖలు

30 లక్షల బోగస్ ఓట్ల తొలగింపు: హైకోర్టులో ఈసీ కౌంటర్

 

 


 

click me!