గద్దర్ మృతి కలచివేసింది: మావోయిస్టు పార్టీ

By narsimha lode  |  First Published Aug 7, 2023, 4:21 PM IST

గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ  స్పందించింది.  గద్దర్ మృతి తీవ్రంగా కలిచివేసిందని ఆ  పార్టీ ప్రకటించింది.  పార్టీ అవసరాల రీత్యా ఆయనను  బయటకు పంపినట్టుగా  మావోయిస్టు పార్టీ తెలిపింది.


 

హైదరాబాద్:  ప్రజా యుద్దనౌక గద్దర్  మృతి తీవ్రంగా కలిచివేసిందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.  అనారోగ్యంతో గద్దర్ నిన్న మధ్యాహ్నం మరణించారు. గద్దర్ మృతిపై  మావోయిస్టు  పార్టీ  సోమవారంనాడు  మీడియాకు ప్రకటనను విడుదల చేసింది.

Latest Videos

గద్దర్  అవసరాన్ని గుర్తించి ఆయనను  బయటకు పంపిందన్నారు. గద్దర్ చేత జననాట్యమండలిని ఏర్పాటు చేయించి ప్రజలను చైతన్యపరిచినట్టుగా  మావోయిస్టు పార్టీ తెలిపింది. ఇతర పార్టీలతో కలిసినందుకు గద్దర్ షోకాజ్  నోటీసు ఇచ్చినట్టుగా  మావోయిస్టు పార్టీ వివరించింది.  2012 వరకు  పీడిత ప్రజల పక్షాన గద్దర్ ఉన్నారని  మావోయిస్టు పార్టీ తెలిపింది.  2012లో గద్దర్  మావోయిస్టు పార్టీకి రాజీనామా చేశారని ఆ పార్టీ ప్రకటించింది.

also read:గద్దర్... ఇది పేరు కాదు ఓ బ్రాండ్..: ఐపిఎస్ సజ్జనార్ వినూత్న నివాళి

 గద్దర్ రాజీనామాను పార్టీ ఆమోదించినట్టుగా  ఆ పార్టీ తెలిపింది.   2012 వరకు పీడిత ప్రజల పక్షాన ఉన్న గద్దర్  పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నారని  మావోయిస్టు పార్టీ తెలిపింది.  సోమవారంనాడు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ  అధికార ప్రతినిధి జగన్ పేరుతో  ఓ ప్రకటన మీడియాకు విడుదల చేసింది. గద్దర్  సుదీర్ఘకాలం పాటు  మావోయిస్టు పార్టీలో  పనిచేశారు.  మావోయిస్టు పార్టీ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు జననాట్యమండలి  ద్వారా గద్దర్ ప్రయత్నించారు.ఆ తర్వాతి కాలంలో గద్దర్  బుల్లెట్ ను వదిలి  బ్యాలెట్ వైపు మొగ్గు చూపారు. 2018 ఎన్నికల్లో తొలిసారిగా  గద్దర్ తన  ఓటు హక్కును వినియోగించుకున్నాడు.  వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని  కూడ గద్దర్ ప్లాన్ చేసుకున్నాడు.

 గత నెల  20వ తేదీన గుండెపోటు రావడంతో  గద్దర్  అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో  చేరారు.  ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  గద్దర్  నిన్న  మృతి చెందాడు.  గద్దర్ పార్థీవ దేహన్ని  ఆసుపత్రి నుండి ఎల్ బీ స్టేడియానికి తీసుకు వచ్చారు.  ఎల్ బీ స్టేడియం నుండి ఇవాళ  మధ్యాహ్నం  నుండి  అల్వాల్ వరకు అంతిమ యాత్ర  సాగింది.

click me!