సీవీ ఆనంద్ సహా మరో ఇద్దరికి డీజీగా పదోన్నతి: తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

Published : Aug 07, 2023, 03:49 PM ISTUpdated : Aug 07, 2023, 03:56 PM IST
సీవీ ఆనంద్ సహా మరో ఇద్దరికి  డీజీగా పదోన్నతి: తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు

సారాంశం

తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు డీజీగా పదోన్నతి కల్పిస్తూ  తెలంగాణ ప్రభుత్వం  ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: తెలంగాణలో ముగ్గురు  ఐపీఎస్ అధికారులకు  డీజీగా పదోన్నతిని కల్పిస్తూ  ప్రభుత్వం సోమవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది.  హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ సహా, రాజీవ్ రతన్, జితేందర్ లను డీజీగా  రాష్ట్ర ప్రభుత్వం  పదోన్నతిని కల్పించింది.

తెలంగాణ ప్రభుత్వం  ఈ ఏడాది  ఫిబ్రవరి మాసంలో  ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను  డీఐజీలుగా ప్రమోషన్ కల్పించింది. అంబర్ కిషోర్ ఝా,  రెమా రాజేశ్వరీ, ఎల్ ఎస్ చౌహాన్,  కే. నారాయణ్ నాయక్,  పరిమల హనా నూతన్ జాకబ్, ఎస్, రంగారెడ్డిలను డీఐజీగా  ప్రమోట్ చేసింది.

మరో వైపు ఈ ఏడాది జూన్ 10వ తేదీన 18 మంది అడిషనల్ ఎస్పీలను  ఎస్పీలుగా  ప్రభుత్వం పదోన్నతిని కల్పించింది. మరో వైపు 37 మంది డీఎస్పీలను  అడిషినల్ ఎస్పీలుగా  పదోన్నతిని కల్పించింది. ఈ ఏడాది మే మాసంలో  ముగ్గురు  ఐపీఎస్ అధికారులను ఐజీలుగా  ప్రమోట్ చేసింది ప్రభుత్వం.

PREV
click me!

Recommended Stories

RTC: ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌పై “Z” మాత్ర‌మే ఎందుకు ఉంటుందో తెలుసా.?
Telangana: ఇప్పుడే కొనేయండి.. తెలంగాణ‌లో కొత్త ఎయిర్ పోర్ట్ వ‌చ్చేస్తోంది. ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం