భద్రాద్రి జిల్లా: పోలీసులకు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు.. ఓ నక్సలైట్ హతం

By Siva KodatiFirst Published Aug 1, 2021, 3:33 PM IST
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతం ఆదివారం కాల్పుల మోతతో దద్దరిల్లింది. చర్ల అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. సంఘటన స్థలం నుంచి ఒక 303 రైఫిల్, రెండు కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టు వారోత్సవాలపై పక్కా సమాచారంతో పోలీసులు ఆదివారం తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలను గమనించిన మావోలు కాల్పులు జరిపారు. ఒక మావోయిస్టు మృతదేహం ఘటన స్థలంలో పడివుండడాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ నిర్ధారించారు. ఈ ఎదురుకాల్పుల్లో పోలీసు బలగాలదే పైచేయి కావడంతో మావోలు అక్కడ్నించి సురక్షిత ప్రాంతాలకు మకాం మార్చినట్లు ఎస్పీ తెలిపారు. 

click me!