కొత్తగూడెంలో ఎన్ కౌంటర్... మావోయిస్టు మృతి

Published : Aug 21, 2019, 10:33 AM IST
కొత్తగూడెంలో ఎన్ కౌంటర్... మావోయిస్టు మృతి

సారాంశం

కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మావోయిస్టుల కూడా కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు హతమయ్యాడు. మణుగూరు మండలం బుడుగుల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది.  సంఘటనాస్థలంలో పోలీసులు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మృతుడు గుంటూరు రవిగా పోలీసులు గుర్తించారు. కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మావోయిస్టుల కూడా కాల్పులు జరిపారు. దీంతో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయని జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మావోయిస్టు పార్టీ విస్తరణ కోసం దళం గుత్తికోయ గ్రామాల్లో తిరుగుతోందని వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Weather Update : ఆంధ్ర ప్రదేశ్ తీరానికి అల్పపీడనం.. ఇక ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలే, రెడ్ అలర్ట్
తెలంగాణలో పాలిటెక్నిక్‌ల‌ను ప్రైవేటీక‌ర‌ణ చేయ‌నున్నారా.? క్లారిటీ ఇచ్చిన మంత్రి వివేక్