బాటిల్స్ కలకలం: సీఎం కేసీఆర్ సహా పలువురికి పార్శిల్స్

Published : Aug 20, 2019, 06:29 PM ISTUpdated : Aug 20, 2019, 06:30 PM IST
బాటిల్స్ కలకలం: సీఎం కేసీఆర్  సహా పలువురికి పార్శిల్స్

సారాంశం

సికింద్రాబాద్ పోస్టాపీసు కార్యాలయానికి వచ్చిన పార్శిళ్లు కలకలం రేపాయి. మంగళవారం నాడు ఈ బాలిల్స్ పై పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నారు. 

హైదరాబాద్:సికింద్రాబాద్ పోస్టాపీసుకు వచ్చిన  పార్శిల్ కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి , మంత్రులు, ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లతో  ఈ బాటిల్స్ వచ్చాయి.

విఐపీలకు బాటిల్స్  పార్శిల్ రావడంపై పోస్టల్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ బాటిల్స్‌లో ఏముందనే విషయమై తేల్చేందుకు ల్యాబ్ కు పంపారు.ఇంత పెద్ద ఎత్తున ఒకే సారి వీఐపీలకు పార్శిల్ రావడంపై పోలీసులు కూడ విచారణ చేస్తున్నారు.ఈ బాటిల్స్ ఎక్కడ నుండి వచ్చాయనే కోణంలో కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

ఈ బాటిల్స్ లో ఏమున్నాయనే విషయమై నిగ్గు తేల్చేందుకు ల్యాబ్ రిపోర్టు కోసం ఎదురు చేస్తున్నారు. ఆకతాయిలు చేసిన పనా.. లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Liquor sales: మాములు తాగుడు కాదు సామీ ఇది.. డిసెంబ‌ర్ 31న‌ ఎన్ని కోట్ల బీర్లు, విస్కీ తాగారంటే
Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్