అక్రమ సంబంధంపై ప్రశ్నించిన భార్యా, అత్తలపై దాడిచేసిన ఎస్సై (వీడియో)

Published : Aug 31, 2018, 10:56 AM ISTUpdated : Sep 09, 2018, 11:41 AM IST
అక్రమ సంబంధంపై ప్రశ్నించిన భార్యా, అత్తలపై దాడిచేసిన ఎస్సై (వీడియో)

సారాంశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఎస్సై దారుణానికి పాల్పడ్డాడు. మణుగూరు పట్టంణంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న జితేందర్ ను అక్రమ సంబంధం గురించి    ప్రశ్నించినందుకు భార్యతో పాటు అత్తను కూడా అతి దారుణంగా చితకబాదాడు. ఈ దాడిలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. 

వివరాల్లోకి వెళితే... మణుగూరు ఎస్‌ఐ జితేందర్‌ కొత్తగూడెంకు చెందిన ఎస్‌కే పర్వీన్‌ను 2015లో ప్రేమవివాహం చేసుకున్నారు. కులాలు వేరైనప్పటికి ఇద్దరు ప్రేమించుకోవడంతో పెద్దలు కూడా వీరి పెళ్లికి అభ్యంతరం చెప్పలేదు. అయితే గత కొంత కాలంగా జితేందర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతడు గంటల తరబడి వేరే మహిళతో చాటింగ్, పోన్ లో మాట్లాడటం చేస్తుండటాన్ని భార్య పర్వీన్ గుర్తించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పర్వీన్ తన అమ్మవారింటికి వెళ్ళిపోయింది.

అయితే అలా వెళ్లి పది నెలలు కావస్తున్నా జితేందర్ భార్యను పట్టించుకోలేదు. దీంతో పర్వీన్ తన తల్లిని, మహిళా సంఘాల ప్రతినిధులను తీసుకుని అతడు నివసిస్తున్న ఇంటికి వెళ్లి ప్రశ్నించింది. దీంతో కోపోద్రిక్తుడైన జితేందర్‌ భార్యతో పాటు అత్తను కూడా చితకబాదాడు. వారిని రక్తం వచ్చేలా కొట్టి అక్కడినుండి పరారయ్యాడు.  

వీడియో

"

PREV
click me!

Recommended Stories

నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet
నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు | Asianet News Telugu