
తెలంగాణ కాంగ్రెస్‌లో చాలా చేరికలు ఉంటాయని టీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. బీజేపీతో పొత్తుకు బీఆర్ఎస్ సిద్దమవుతుందని ఆరోపించారు. కేసీఆర్ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను దర్యాప్తు సంస్థలు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులను కేటీఆర్ కలవడం వెనక అంతర్యమేమిటని ప్రశ్నించారు. పాట్నాలో విపక్షాల భేటీ జరుగుతోన్న విషయం తెలిసి.. మరోవైపు ఢిల్లీలో బీఆర్‌ఎస్ నేతలు బీజేపీతో మంతనాలు జరుపుతున్నారన్నారని అనుమానాలు వ్యక్తం చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్‌లు ఒకటేనని ప్రజలు గ్రహించారని అన్నారు. కాంగ్రెస్‌పై తెలంగాణ ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణపై ప్రియాంక గాంధీ ఫోకస్ చేశారని చెప్పారు. తెలంగాణలో పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారని తెలిపారు.