టీపీసీసీ చీఫ్ పదవి: రెండో రోజూ నేతల నుండి ఠాగూర్ అభిప్రాయాల సేకరణ

By narsimha lodeFirst Published Dec 11, 2020, 6:09 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్ అధ్యక్ష పదవి కోసం పార్టీ నేతల అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ రెండోరోజూ  కూడ అభిప్రాయాలు సేకరించారు.
 

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ అధ్యక్ష పదవి కోసం పార్టీ నేతల అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ రెండోరోజూ  కూడ అభిప్రాయాలు సేకరించారు.

ఇప్పటివరకు 65 మంది నేతల నుండి ఠాగూర్ పీసీసీ చీఫ్ అధ్యక్ష పదవి కోసం అభిప్రాయాలను సేకరించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీగా పోటీ చేసిన అభ్యర్ధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులతో  ఠాగూర్ ఇవాళ భేటీ అయ్యారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఎవరికి అవకాశం కల్పిస్తే పార్టీకి ప్రయోజనం కలుగుతోంది, ఎవరు పార్టీని  బలోపేతం చేస్తారనే విషయమై ఠాగూర్ నేతల నుండి అభిప్రాయాలను సేకరించారు.పీసీసీ రేసులో ఉన్న అభ్యర్ధులు కూడ ముఖాముఖి ఠాగూర్ ను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరారు.

also  read:సీఎం పదవొద్దు, మంత్రి పదవొద్దు.. కానీ..: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే పార్టీ నేతల మధ్య సమన్వయం ఉంటుంది.. అసంతృప్తులు తలెత్తకుండా ఉంటుందనే విషయమై  ఆరా తీశారు.పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకొని ఎఐసీసీ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు  ఠాగూర్ నివేదిక ఇవ్వనున్నారు. 

ఈ నివేదిక ఆధారంగా టీపీసీసీ చీఫ్ పదవికి నియమించనున్నారు. ఈ నెలాఖరు వరకు కొత్త టీపీసీసీ చీఫ్ ఎవరో తేలనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

click me!