మోడీ కాళ్ళు పట్టుకోవడానికే కేసీఆర్ ఢిల్లీకి .. మధుయాష్కి సంచలన వ్యాఖ్యలు..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 11, 2020, 04:50 PM IST
మోడీ కాళ్ళు పట్టుకోవడానికే కేసీఆర్ ఢిల్లీకి .. మధుయాష్కి సంచలన వ్యాఖ్యలు..

సారాంశం

మోడీ కాళ్ళు పట్టుకోవడానికే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాడంటూ ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదనడం కేసీఆర్ అవివేకం అని దుయ్యబట్టారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ ఏర్పడిందని ఆయన అన్నారు. 

మోడీ కాళ్ళు పట్టుకోవడానికే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లాడంటూ ఏఐసీసీ కార్యదర్శి మధు యాష్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదనడం కేసీఆర్ అవివేకం అని దుయ్యబట్టారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ ఏర్పడిందని ఆయన అన్నారు. స్వార్ధ రాజకీయ లాభం కోసం తెలంగాణ అన్నది కేసీఆర్ అని మండిపడ్డారు. కేసీఆర్ అవినీతి బయట పడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సిద్దిపేటలో కట్టి జన్మ ధన్యం అయ్యింది అనుకుంటున్నారని మిగిలిన 8 లక్షల మందికి ఎప్పుడు డబుల్ బెడ్ రూమ్ ఇస్తారని ఆయన ప్రశ్నించారు.  మోడీ కాళ్ళు పట్టుకోవడానికి కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాడన్నారు. ప్రధాని అపోయింట్మెంట్ లేకున్నా... ఢిల్లీకి ఎందుకు వెళ్ళాడో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అవినీతి బయట పెట్టి జైల్లో పెడతా అని బీజేపీ నాయకులు చెప్పిన మాటలకు భయంతో కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాడని, జైలుకు వెళ్తాననే భయం కేసీఆర్ కి పట్టుకుందని ఎద్దేవా చేశారు. బీజేపీ, ఎంఐఎం, టీఆర్ఎస్ మూడు పార్టీలు కలిసి ప్రజలను మోసం చేస్తున్నాయని అయన అన్నారు. 

తెర ముందు కొట్లాడినట్టు కనిపిస్తూ,  తెరవెనుక మూడు పార్టీలు దోస్తానా చేస్తున్నాయని అన్నారు. మూడు నెలలుగా రిజిస్ట్రేషన్ లు ఎందుకు అపావని బీజేపీ ఎందుకు అడగదు అని ఆయన ప్రశ్నించారు.  మోడీని కేసీఆర్ ఆహా, ఓహో అని పొగడ్తల్లో ముంచడం వల్లే, కేసీఆర్ సెక్రటేరియట్ కూల్చితే బీజేపీ మద్దతు పలికిందని అన్నారు. 

ఇప్పుడు మోడీ కొత్త పార్లమెంట్ కడితే, కేసీఆర్ ఆహా..ఓహో అంటూ భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీలో అబద్దాలు ఎక్కువ చెప్పే వాళ్ళు అధ్యక్షుడు అవుతారు, టీడీపీలో కమ్మ వాళ్ళు మాత్రమే అధ్యక్షుడు అవుతారు, కానీ ఒక్క  కాంగ్రెస్ లో మాత్రమే ఎవరైనా అయ్యే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.  
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్