కడియం ను చూసి సిగ్గుపడుతున్న

Published : Nov 09, 2017, 03:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
కడియం ను చూసి సిగ్గుపడుతున్న

సారాంశం

మంత్రి ఈటల పదవికి రాజీనామా చేయాలి జగదీష్ రెడ్డిని తొలగించాలి కడియం తీరు సిగ్గుచేటు సిఎం ఇచ్చిన హామీ ఏమైంది?

తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని చూసి సిగ్గుతో తలదించుకుంటున్నానని అన్నారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో పలు అంశాలపై స్పందించారు. ఆయన ఏమన్నారో కింద చదవండి.

మాదిగల వర్గీకరణ విషయంలో ఒకనాడు కడియం శ్రీహరి చూస్తే గర్వంగా ఉండేది.. ఈనాడు కడియం శ్రీహరి ని చూసి సిగ్గుతో తలవంచుకుంటున్నాను. కడియం శ్రీహరి కి ఉప ముఖ్యమంత్రి ఉన్నది కేవలం దొర కు బానిసత్వం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతున్నది. భారతి విషయంలో కడియం చర్యలు నామమాత్రం.

భారతి మృతి పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరిపించాలి. ఆమె ఆశయసాదనకోసం ఈ రోజు నుండి 19 వ తేదీ వరకు తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేపడతాం. నవంబరం 20 న భారీ ఎత్తున హైద్రబాద్ లో భారతి సంస్మరణ సభ ఏర్పాటు చేస్తున్నాం.

మాదిగల పట్ల కేసిఆర్ మొసలి కన్నీళ్లు కార్చడం బంద్ చేయాలి. మాదిగ ఎమ్మెల్యేలు 8 మందిలో ఎవరికో ఒకరికి సంక్షేమ శాఖ మంత్రి పదవి ఇవ్వాలి. రెండు రోజుల్లో అన్ని పక్షాల నేతలతో సంతకం తీసుకుని ప్రదాన మంత్రి అపాయింట్ మెంట్ కోసం లేఖ పంపుతాన్న ముఖ్యమంత్రి  హామీ ఏమైంది?

హమీ ఇచ్చిన 3 రోజులైనా స్పందన లేదు. భారతి ఫిట్స్ తో చనిపొయిందని అసెంబ్లీలో తప్పుడు ప్రకటన చేసిన ఈటెల రాజేందర్ మంత్రి పదవి నుండి తప్పుకోవాలి లేదా సీ.ఎం తప్పించాలి. లేక పోతే త్వరలోనే మాదిగల ఆగ్రహం చవిచూస్తడు.

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా జగదీష్ రెడ్డి అన్ ఫిట్. ఆయన మంత్రి పదవి నుండి ఈ క్షణమే వైదొలిగాలి, లేకపోతే తామే ఆయనను తొలగించాలని రహదార్ల పైకి వస్తం. ఏనాడైనా వర్గీకరణ విషయంలో మంత్రి జగదీష్ రెడ్డి కేంద్రంతో మాట్లాడిండా? కే.సీ.ఆర్ జగదీష్ రెడ్డిలు మాదిగల పట్ల కపట ప్రేమ ను చూపిస్తున్నారు..మీ కపట ప్రేమ ను గ్రహించలేని స్థితిలో మాదిగలు లేరనే విషయం గుర్తు పెట్టుకోవాలి.

 

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి

కెనడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వ్యక్తి మృతి

పాలమూరులో ఈతకు వెళ్లి ఇద్దరు పోరగాళ్లు మృతి

ఒగ్గు కళా దిగ్గజం చుక్కా సత్తయ్య కన్నుమూత

https://goo.gl/KywP1D

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా