మంచిర్యాల-వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ కేసులో రైతులకు ఊరట: కౌంటర్ దాఖలుకు హైకోర్టు ఆదేశం

By narsimha lode  |  First Published Mar 8, 2023, 4:17 PM IST

మంచిర్యాల-వరంగల్  హైవే పనుల  నోటిఫికేషన్ నిలిపివేయాలని రైతులు  దాఖలు  చేసిన  పిటిషన్ పై  హైకోర్టులో  ఊరట లభించింది.  ఎనిమిది వారాల వరకు  రైతులను  భూముల నుండి ఖాళీ చేయవద్దని  హైకోర్టు  ఆదేశించింది.



హైదరాబాద్: ఎనిమిది వారాల వరకు  రైతులను  భూముల  నుండి  ఖాళీ చేయవద్దని  తెలంగాణ హైకోర్టు  ఆదేశాలు  జారీ చేసింది. మంచిర్యాల-వరంగల్  హైవే పనుల  నోటిఫికేషన్ నిలిపివేయాలని హైకోర్టులో   రైతులు  పిటిషన్ దాఖలు  చేశారు.

ఈ పిటిషన్ పై  తెలంగాణ హైకోర్టు  బుధవారం నాడు విచారణ నిర్వహించింది. గ్రీన్ ఫీల్డ్  హైవే కోసం భూసేకరణను నిలిపివేయాలని ఆ పిటిషన్ లో  రైతులు  కోరారు. 
ఈ విషయమై  రైతుల  తరపున న్యాయవాదులు  హైకోర్టులో  వాదనలు విన్పించారు. భూసేకరణను  పిటిషనర్ల తరపు న్యాయవాది  వ్యతిరేకిస్తూ  వాదనలు  విన్పించారు.   ఎనిమిది  వారాల వరకు   రైతులను ఈ భూముల నుండి ఖాళీ చేయవద్దని హైకోర్టు  మధ్యంతర ఉత్తర్వులు  జారీ చేసింది. కౌంటర్ దాఖలు  చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను  ఆదేశించింది.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ అనుమతులు తీసుకోవాలని కూడా హైకోర్టు ఆదేశించింది. 

Latest Videos

రూ. 2500  కోట్ల అంచనాతో  మంచిర్యాల- వరంగల్  మధ్య గ్రీన్ ఫీల్డ్  హైవే  నిర్మాణాన్ని  చేపట్టాలని జాతీయ రహదారుల  అధారిటీ  ఆఫ్ ఇండియా  నిర్ణయం తీసుకుంది. మంచిర్యాలలోని  నర్వ గ్రామం నుండి  వరంగల్  జిల్లాలోని  ఊరుగొండ గ్రామం వరకు  నాలుగు లైన్ల  జాతీయ రహదారి  నిర్మాణం చేపట్టనున్నారు.  108 కి.మీ  వరకు  ఈ రోడ్డు ఉంటుంది. 
 

click me!