సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎస్ఐ తిరుపతిపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.తన స్నేహితులతో కలిసి ఎస్ఐ హంగామా చేశారు. ఈ ఘటనపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మంచిర్యాల: సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఎస్ఐ తిరుపతిపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు.మంగళవారంనాడు రాత్రి మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద బెజ్జంకి ఎస్ఐ తిరుపతి హల్ చల్ చేశారు. మద్యం తాగి రోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ విషయమై స్థానికులు ఎస్ఐ అతని స్నేహితులను ప్రశ్నించారు. అతను పట్టించుకోలేదు. దీంతో స్థానికులు 100 కు ఫోన్ చేశారు. అయితే రోడ్డుపై వీరంగం సృష్టిస్తున్న ఎస్ఐ, అతని స్నేహితులను స్థానిక పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. కానీ స్థానిక కానిస్టేబుల్ పై ఎస్ఐ తిరుపతి దాడి చేశారు. అడ్డుకున్న స్థానికులపై కూడ దాడికి దిగారు. కొందరి సెల్ ఫోన్లను కూడ ధ్వంసం చేశారు. ఈ విషయమై మంచిర్యాల పోలీసులు బెజ్జంకి ఎస్ఐ తిరుపతిపై కేసు నమోదు చేసినట్టుగా ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
also read:మంచిర్యాలలో బెజ్జంకి ఎస్ఐ వీరంగం: స్నేహితులతో కలిసి స్థానికులపై దాడి
మద్యం మత్తులో ఎస్ఐ , తన స్నేహితులతో హంగామా చేశారని ఈ కథనం తెలిపింది. ఎస్ఐ తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న కొందరు వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం చర్చకు దారి తీసింది., నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నందున ఇప్పటికే 50 మంది సర్వీసు నుండి తొలగిస్తూ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.