ప్రేమోన్మాది దాడి: ఆసుపత్రిలో కోలుకొంటున్న మనస్విని

Published : Jul 10, 2019, 03:08 PM IST
ప్రేమోన్మాది దాడి: ఆసుపత్రిలో కోలుకొంటున్న మనస్విని

సారాంశం

ప్రేమోన్మాది దాడిలో దాడికి గురైన మనస్విని కోలుకొంటుందని వైద్యులు ప్రకటించారు. మరో నాలుగైదు రోజుల్లో ఆమె పూర్తిగా కోలుకొనే అవకాశం ఉందని ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి


హైదరాబాద్:ప్రేమోన్మాది దాడిలో దాడికి గురైన మనస్విని కోలుకొంటుందని వైద్యులు ప్రకటించారు. మరో నాలుగైదు రోజుల్లో ఆమె పూర్తిగా కోలుకొనే అవకాశం ఉందని ఆసుపత్రివర్గాలు ప్రకటించాయి

మంగళవారం నాడు మనస్వినిపై ప్రేమోన్మాది ప్రవీణ్ అలియాస్ వెంకటేష్ కత్తితో దాడికి దిగాడు. దీంతో లాడ్జీ సిబ్బంది, కుటుంబసభ్యులు వెంటనే మనస్విని ఆసుపత్రిలో చేర్పించారు. ఐదు గంటల పాటు మనస్వికి శస్త్రచికిత్స చేశారు. 

మెడ బాగం తెగిపోవడంతో ప్లాస్టిక్ సర్జరీ చేశామని వైద్యులు తెలిపారు. మనస్వినికి  ఐదు ప్యాకెట్ల రక్తం ఎక్కించారు. కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఎఖక్కువగా రక్తం ఎక్కించాల్సి వచ్చిందని వైద్యులు చెప్పారు.

మంగళవారంతో పోలిస్తే బుధవారం నాటికి మనస్విని ఆరోగ్యంలో మార్పు వచ్చిందన్నారు. అయితే ఇంకా 24 గంటల పాటు ఆమెను అబ్జర్వేషన్‌లో ఉంచాల్సిన అవసరం ఉందని  డాక్టర్లు ప్రకటించారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!