కవిత ఇంటికి వెళ్లి.. సభ్యత్వం ఇచ్చిన మంత్రి వేముల

Published : Jul 10, 2019, 02:19 PM IST
కవిత ఇంటికి వెళ్లి.. సభ్యత్వం ఇచ్చిన మంత్రి వేముల

సారాంశం

హైటెక్స్ లోని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ మహిళా నేత కల్వకుంట్ల కవిత ఇంటికి మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ క్రీయాశీల సభ్యత్వాన్ని ఈ సందర్భంగా మంత్రి వేముల.. కవితకు అందజేశారు.

హైటెక్స్ లోని మాజీ ఎంపీ, టీఆర్ఎస్ మహిళా నేత కల్వకుంట్ల కవిత ఇంటికి మంగళవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెళ్లారు. టీఆర్ఎస్ పార్టీ క్రీయాశీల సభ్యత్వాన్ని ఈ సందర్భంగా మంత్రి వేముల.. కవితకు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా చురుగ్గా సాగుతుందన్నారు. పార్టీ నిర్దేశించిన లక్ష్యము కంటే ఎక్కువ సభ్యత్వ నమోదు అవుతుందని చెప్పారు. ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల,  కేసీఆర్ నాయకత్వం పట్ల  పూర్తి విశ్వాసం ఉందనడానికి ఇది నిదర్శనం అని మంత్రి అన్నారు.

తెలంగాణ హక్కులు కాపాడటం ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడం ఒక్కటేనన్నారు. అది కూడా టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని చెప్పారు. అందుకే తమ పార్టీపై ప్రజలు ఎక్కువ నమ్మకంతో ఉన్నారని.. సభ్యత్వం కూడా ఎక్కువ మంది తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!